వార్నర్ కు మరో ఘనత IPL లో రెండవ ఆటగాడిగా

David Warner Got Highest Runs In Ipl History  (వార్నర్ కు మరో ఘనత IPL లో రెండవ ఆటగాడిగా):  డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో  ఎవరికీ సాధ్యం కాని RECORD సాధించాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో  వార్నర్ ఈ రికార్డు అందుకొన్నాడు.

ఐపీఎల్  లీగ్ లో  అరుదైన ఘనతను అందుకొన్నాడు మన వార్నర్ టిక్ టాక్ స్టార్.  ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న ఈ ఆస్ట్రేలియా ఆటగాడు.. ఐపీఎల్ లో రెండు జట్లపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఢిల్లీ-కోల్కతా మధ్య గురువారం రాత్రి వాంఖెడే వేదికగా ముగిసిన మ్యాచ్ లో 26 బంతుల్లో 42 పరుగులు చేసిన వార్నర్.. ఆ జట్టుపై వెయ్యి పరుగులు (1,018) పూర్తి చేశాడు. ఒక ఫ్రాంచైజీపై వెయ్యి పరుగులు పూర్తి చేయడం వార్నర్ కు ఇది రెండోసారి.

ఇక పోతే వార్నర్ వారం రోజుల క్రితమే అతడు పంజాబ్ కింగ్స్ పై కూడా ఇదే రికార్డు సాధించాడు.  ఆ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న  వార్నర్.. పంజాబ్ పై  మొత్తంగా 1,005 పరుగులు చేశాడు.

ఇక ఒక జట్టు పై వెయ్యి పరుగులు పూర్తి చేసిన వారి జాబితాలో  వార్నర్ కు ముందు రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్ మ్యాన్ కూడా కేకేఆర్ పై 1,018 పరుగులు చేశాడు.  రోహిత్ తో పాటు శిఖర్ ధావన్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ పై  వెయ్యి రన్స్ కొట్టిన మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

 ఈ విధముగా  వార్నర్  పంజాబ్ కింగ్స్ తో పాటు కోల్కతా మీద కూడా ఈ ఫీట్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు 155 మ్యాచులాడిన వార్నర్.. 5,668 పరుగులు చేశాడు.
మొత్తంగా ఈ లీగ్ లో నాలుగు సెంచరీలు, 53 హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న వార్నర్.. 5 మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలతో 219 పరుగులు చేయడం విశేషం.
ఇవే కాక ఇంకా చదవండి 
  1. జూనియర్ హాకీ చాంపియన్స్ షిప్– సెమి ఫైనల్లో భారత్
  2. కౌంటీ చాంపియన్‌షిప్‌లో పుజారా హ్యాట్రిక్ సెంచరీ

Related Articles

Latest Articles