మెంతులు అనగా ఏమి ? మెంతులు వలన ప్రయోజనాలు ఏమిటి !

మెంతులు అనగా ఏమి ?

మెంతులు చూడటానికి పసుపు గోధుమ రంగులలో కలగలిసి మంచి సువాసనను కలిగి ఉండే వంటింటి దినుసు. చేదు రుచిని కలిగి నానబెట్టిన తరువాత జిగురు స్వభావాన్ని కలిగివుండే ఈ మెంతులు ఆరోగ్య పరంగా గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తాయి.

ఆవకాయ పచ్చళ్ళు, వివిధ రకాల వంటలో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. మెంతి పిండి వేయని ఆవకాయ కనిపించదు. ఇక మెంతులను నాటడం ద్వారా లభ్యమయ్యే మెంతికూర ఆకుకూరల్లో ప్రసిద్ధి చెందినది. ఈ మెంతి కూరతో బోలెడు రకాల వంటలు చేసుకోవచ్చు.వీటిలో  ఫైబర్, ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.

మెంతుల యొక్క మొక్కలను సంవసత్సరానికి ఒకసారి పండించడం జరుగుతుంది. ఈ మొక్కల యొక్క ఎత్తు రెండు లేదా మూడు అడుగులు ఉంటుంది. దీని కాయలు మూంగ్ దాల లాగా ఉంటాయి. దీని విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి.

వీటి రుచి చూసుకున్నట్లయితే చేదుగా ఉంటుంది. మెంతుల మొక్కల ఆకులను చూస్తే లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. మరియు వీటి యొక్క పువ్వులు తెలుపు రంగులో ఉంటాయి. వీటి కాయలలో 10 నుండి 20 వరకు చిన్న పసుపు గోధుమరంగు విత్తనాలు ఉంటాయి.

యువతను అనేక వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు. వీటిని వాన్ ఫెనుగ్రీక్ అని విలువను పడుతుంది. ఇది చాలా తక్కువ నాణ్యత తో కలిగి ఉంటుంది. వీటిని ఎక్కువ పశువుల కొరకు ఉపయోగిస్తుంటారు.

మెంతులు తెలియని వారు ఉండరు. ప్రతీ వంటగదిలో తప్పకుండా ఉండే వస్తువు ఇది. మెంతి పొడిని పప్పుల్లో, పులుసుల్లో, పచ్చళ్లలో కలుపుతారు. అలాగే మెంతి కూర (ఆకు కూర) ను కూడా పప్పు, కూరలలో వాడుతూ ఉంటారు. మెంతులు పసుపు రంగులో ఉంటాయి. మంచి సువాసనను కలిగి ఉంటాయి. మెంతులను వేయించినప్పుడు ఇంకా చక్కని సువాసన వస్తుంది. అయితే మెంతులు చేదుగా ఉంటాయి. అందువల్ల వంటకాలలో తక్కువ మోతాదులో వాడతారు.

మెంతులను ఇంగ్లీష్ లో ‘ఫెన్యుగ్రీక్’ అనీ, హిందీలో ‘మేథీ’ అని, తమిళంలో ‘వెంద్యం’ అనీ, మలయాళంలో ‘ఉలువ’ అనీ, కన్నడంలో ‘మెంతే’ అనీ, పంజాబీలో ‘మెత్’ అనీ, మరాఠీలో ‘మేతి దానే’ అని మరియు బెంగాలీలో ‘మేథీ’ అనీ అంటారు.

మెంతులలో పీచు పదార్ధం సమృద్ధిగా వుంటుంది. మెంతి ఆకుల్లో ఇనుము ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. అంతేకాక యాంటీ యాక్సిడెంట్స్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

మెంతులు ఎలా ఉపయోగించాలి, మెంతుల వలన ఉపయోగాలు ఏమిటి :

మెంతులు వంటల్లో ఉపయోగించవచ్చు. వీటిని సాధారణంగా నేరుగా కాకుండా పొడి రూపంలో ఎక్కువగా వాడతారు. అలాగే వీటిని నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగుతారు.  ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లతో కొద్దిగా మెంతి పొడిని కలిపి తీసుకోవచ్చు.మెంతులు జుట్టు సంరక్షణలోను ఆరోగ్య సంరక్షణలోనూ విరివిగా ఉపయోగిస్తారు.

మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది :

మధుమేహం ఉన్నవారు ఆరోగ్యాన్ని కాపాడుకొని రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి మెంతులు మంచి ఎంపిక. టైప్-2 డయాబెటిస్ తగ్గించడంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి.  అలాగే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

బాలింతలలో పాల ఉత్పత్తిని పెంచుతుంది :

మెంతి గింజలను వంటింటి చిట్కాగా తల్లి పాల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగిస్తారు.  వీటిలో ఫైటోఈస్ట్రోజెన్ ఉంటుంది, ఇది పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తిని పెంచుతుంది. దీనికోసం మెంతులు నీటిలో వేసి మరిగించి  మెంతి టీ తయారుచేసుకుని తాగడం వల్ల తల్లులలో  పాల సరఫరా పెరుగుతుంది

చర్మ సంరక్షణలో తోడ్పడుతుంది :

చాలామంది అమ్మాయిలకు నునుపైన చర్మం ఒక కల. అలాగే చేతులు కాళ్ళు మీద మచ్చలు, ముఖం మీద మొటిమల తాలూకూ గుర్తులు ఇవన్నీ అమ్మాయిలను ఇబ్బంది పెడతాయి. అలాంటివాళ్ళ స్పూన్ ముల్తానీ మట్టి, స్పూన్ మెంతి పిండి, స్పూన్ శనగపిండి తీసుకుని అందులో స్పూన్ పెరుగు, కొద్దిగా రోజ్ వాటర్ వేసి బాగా పేస్ట్ చేసి ముఖానికి, చేతులకు, కాళ్లకు పాక్ లాగా వేసుకోవాలి.ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే ఎలాంటి బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది :

మహిళలు తీసుకునే జాగ్రత్తల్లో జుట్టుపెరుగుదల కోసం పాటించే చిట్కాలు బోలెడు ఉంటాయి. తలకు పెట్టుకునే కొబ్బరి నూనెలో గుప్పెడు మెంతులు వేసి మరిగించి చల్లగా అయిన తరువాత వడగట్టి ఒక గాజు సీసాలో ఆ నూనెను భద్రపరుచుకోవాలి.దీన్ని వారంలో రెండు లేదా మూడు సార్లు జుట్టుకు కుదుళ్లకు ఇంకెలా మెల్లగా మర్దనా చేస్తూ అప్లై చేసుకోవాలి. దీనివల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది, చుండ్రు, దురద, తెల్ల వెంట్రుకలు వంటివి తగ్గిపోతాయి.

బెస్ట్ రిలీఫర్ గా పనిచేస్తుంది :

మెంతులను పొడిగా చేసి ఆ పొడిని తీసుకోవడం వల్ల. శరీరం అలసట, తలనొప్పి మరియు వికారం వంటి లక్షణాలను గణనీయంగా తగ్గిస్తుంది.

గుండెపోటును నివారించండి :

మెంతులు తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల గుండెపోటు సమయంలో ఏర్పడే ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి. తద్వారా గుండెపోటు వల్ల మనిషికి ప్రాణహాని జరగకుండాచేస్తాయి.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది :

మెంతి గింజలు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించటానికి ఎంతో బాగా సహాయపడతాయి.  ముఖ్యంగా మన శరీరంలోని ‘చెడు’ కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గిస్తాయి. మెంతి గింజల్లో నరింగెనిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది, ఇది అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో లిపిడ్ స్థాయిలను తగ్గిస్తుంది.

జీర్ణక్రియకు సహాయం చేస్తుంది :

కడుపు సంబంధ సమస్యలతో  బాధపడేవారికి మెంతులు ఒక వరం.  ఇది కడుపులో అల్సర్ పుండ్లు మరియు అజీర్ణానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఇంఫులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే కడుపు పూతల వల్ల ఏర్పడే జీర్ణ సమస్యలకు సహాయపడుతుంది.

బరువు తగ్గడంలో సహాయం :

బరువు తగ్గాలంటే, ఆహారంలో మెంతి గింజలను చేర్చడం తప్పనిసరి.  మెంతి విత్తనాలు కొవ్వు పేరుకుపోవడాన్ని నివారించడంలో సహాయపడతాయి మరియు బరువు తగ్గడానికి సహాయపడే లిపిడ్లు గ్లూకోజ్ తొందరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

మెంతులు వలన దుష్ప్రభావాలు :

  •  మెంతులు గర్భధారణ సమయంలో ఉపయోగించడం సురక్షితం కాదు. గర్భవతిగా ఉంటే వైద్య సలహా లేకుండా మెంతులు ఉపయోగించకూడదు.
  • అలాగే పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు వైద్యుల సలహాతో వీటిని తీసుకుంటే మంచిది. కొందరిలో ఇవి వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయి.
  • మెంతులు పిల్లలకు ఇవ్వడం మంచిది కాదు.
  • అనారోగ్య సమస్యలు దృష్ట్యా ఇతర మందులు వాడుతున్నపుడు మెంతులు తీసుకోకూడదు.
  • మెంతులను గర్భిణీ స్త్రీలు తినడం అంత మంచిది కాదు దాని వల్ల ముందుగానే డెలివెరి అయ్యే ప్రమాదం ఉంది (20). డెలివరీకి ముందు మెంతులు తింటే శిశువు నుండి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.
  • మధుమేహానికి వాడే వారు డాక్టర్ సలహాతో మెంతులను తీసుకోవడం మంచిది.
  • కొంతమందికి మెంతుల ఎలర్జీ ఉంటుంది. వారు మెంతులను తీసుకోకపోవడమే మంచిది.

మెంతులు వలన కలిగే ప్రయోజనాలు :

మెంతులు.. రుచికి చేదుగానే ఉన్నా, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఇందులో మెండుగా ఉంటాయి. ఎన్నో రోగాలతో పోరాడగలిగే శక్తి మెంతులకు ఉంటుంది. అందుకే మన పూర్వికులు ప్రతి వంటకంలో మెంతులను వాడేవారు. మెంతులను ఎక్కువగా ఊరగాయలు, పులుసు, పోపుల్లో వాడుతుంటారు. ఇటీవల వీటి వాడకం బాగా తగ్గిపోయింది. అవి ఉన్నా.. లేకపోయినా పర్వాలేదనే భావనలో ప్రజలు ఉన్నారు. మెంతులను పొడి చేసుకుని తిన్నా లేదా నీటిలో నానబెట్టి తాగినా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మరి, ఆ ప్రయోజనాలేమిటో చుసేదం.

  •  జీర్ణ సమస్యలతో బాధపడేవారు మెంతులను తీసుకోవడం మంచిది.
  •  మెంతులను నానబెట్టిన నీరు తాగితే జీర్ణ సమస్యలు ఉండవు.
  •  మెంతుల నీటిని తాగితే మలబద్ధకం, జీర్ణసమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • డయబెటీస్ (మధుమేహం)తో బాధపడేవారు రోజూ మెంతుల నీటిని తాగితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
  • మెంతులు జుట్టు రాలే సమస్యను అరికడుతాయి. రంగు కూడా నెరవకుండా కాపాడతాయి.
  • జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు మెంతుల పొడి, పెరుగు కలిపి నానబెట్టి జుట్టు రాసి, మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • మెంతుల్లో శరీరానికి మేలు చేసే ఇనుము, పీచు పదార్థాలు, విటమిన్ C, B1, B2, కాల్షియంలు సమృద్ధిగా ఉన్నాయి.
  • బాలింతలు ఈ మెంతులను నేరుగా తీసుకున్నా, పొడి రూపంలో తీసుకున్నా పాల ఉత్పత్తి పెరుగుతుంది.
  •  మెంతులతో కషాయం చేసుకుని తాగినా, మెంతికూర పప్పు ఎక్కువగా తిన్నా బాలింతల్లో పాలు ఉత్పత్తి మెరుగవుతుంది.

ఇవి కూడా చదవండి 

Related Articles

Latest Articles