నిద్ర పట్టడానికి చిట్కాలు | Nidra Pattadaniki Chitkalu
ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్య వల్ల బాధపడుతున్నారు. చాల మంది నిద్ర రావటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే 8 గంటల నిద్ర అవసరం.కానీ ఇప్పుడు మనిషి ఉద్యోగం అని, ఇతర కారణాల వలన సరిగా నిద్ర పోవటం లేదు.
మన జీవన విధానంలో కొన్ని మార్పులను చేసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇప్పుడు నిద్ర పట్టడానికి కొన్ని చిట్కాలని తెలుసుకుందాం.
నిద్ర పట్టడానికి చిట్కాలు | నిద్ర పట్టాలంటే ఏం చేయాలి ?
నిద్ర పట్టడానికి అనేక రకాల చిట్కాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- పడుకునే ముందు రోజు గోరు వెచ్చని పాలలో ఒక స్పూన్ తేనె కలుపుకోని తాగాలి. ఇలా చేయడం వలన హాయిగా నిద్ర వస్తుంది.
- రాత్రిపూట అరటి పండు తినాలి.ఇలా తినటం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తద్వారా హాయిగా నిద్ర పడుతుంది.
- బాదం తినాలి. బాదంలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది నిద్రిస్తున్న సమయంలో రక్తంలోని చక్కెరస్థాయిని నియంత్రించడంలో ఎంతగానో సాయపడుతుంది.
- చేపలు తినటం ఆరోగ్యానికి చాల మంచిది.ఇవి తినటం వలన కూడా నిద్ర బాగా వస్తుంది.
- బఠానీలు బాగా తినటం వలన నిద్ర హాయిగా వస్తుంది.ఈ బఠానీలో నిద్రకు సంబంధించిన పోషకాలు అధికంగా ఉంటాయి.
- ఆకూకురాలని ఎక్కువగా తినటం వలన నిద్రలేమి సమస్య చాల దగ్గుతుంది. ఈ సమస్య ఉన్నవారు రెండు రోజులకి ఒకసారి ఆకూకురాలని తింటే చాల మంచిది.
- రాత్రి పడుకునే ముందు కొంచం సేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలి.
- పడుకునే ముందు టివిని చూడరాదు.
- గసగాసలని దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన నిద్ర బాగా వస్తుంది.
- పడుకునే ముందు మీకు నచ్చిన దృశ్యాలను ఉహించుకోవాలి.
- పడుకునే ముందు మొబైల్ చూడకూడదు.
- రాత్రి పడుకునే ముందు మీకు నచ్చిన సంగీతాన్ని వింటూ ప్రశాంతగా పడుకోవాలి.
- పడుకునే ముందు చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి.
- పడుకునే ముందు కాఫీ, టి వంటివి తాగరాదు.
- పడుకోవటానికి గంట ముందు వేడి నీళ్ళతో స్నానం చేసుకోవాలి. ఇలా చేయటం వలన శరీరం రిలాక్స్ అవుతుంది.దీని వల్ల హాయిగా నిద్ర పడుతుంది.
- తేలికైన ఆహారాన్ని రాత్రి పూట తినాలి.
- రాత్రి సమయంలో భోజనానికి పడుకోవటానికి మధ్య కనీసం గంట వ్యవధి ఉండేలా చూసుకోవటం.
- పడుకోవటానికి అరగంట ముందు కొంచం సేపు నడవాలి.
- పడుకునే ముందు గ్రీన్ టి తాగటం ఆరోగ్యానికి చాల మంచిది.
- సాయత్రం పూట క్రైమ్ న్యూస్లు చూడకూడదు.ఎందుకంటె అవి నిద్రలోకి వచ్చి మెలుకువ వచ్చేల చేస్తాయి.కాబట్టి సాయంత్రం మంచి నవ్వు తెప్పించే షోలను చూడాలి.
- రాత్రి భోజనంలో మజ్జిగ తీసుకోవడం వలన కూడా చక్కగా నిద్ర పడుతుంది.
మజ్జిగలో ఉండే ట్రిప్టోఫాన్ నిద్రను ప్రేరేపించడం జరుగుతుంది - పడక గదిలో వెలుతురు తక్కువ ఉండేలా చూసుకోవాలి.
- పడుకొనే ముందుగా కూల్ వాటర్ తీసుకోవడం వలన కూడా రాత్రిపూట బాగా నిద్ర పడుతుంది.
- పడుకొనే ముందుగా కూల్ వాటర్ తీసుకోవడం వల్ల రాత్రిపూట నిద్ర పడుతుంది.
నిద్రపట్టక పోవటానికి కారణాలు | Nidra Pattaka Povataniki Karanalu
నిద్ర పట్టక పోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇపుడు మనం తెలుసుకుందాం.
- పడుకునే ముందు మొబైల్ ఎక్కువగా చూడటం.
- టివి ఎక్కువగా చూడటం.
- పగలు ఎక్కువ సమయం నిద్ర పోవటం.
- ఎక్కువగా పని చేయటం వలన నిద్ర సరిగా రాదు. ఎందుకంటె పని ఎక్కువగా చేస్తే నొప్పులు వస్తాయి.తద్వారా నిద్ర సరిగా రాదు.
- పడుకునే ముందు ఎక్కువగా ఆలోచించడం.
- సరిగా తినకపోవటం
గమనిక :- పైన పేర్కొన్న సమాచారం కేవలం మీకు అవగాహనా రావటం కోసం ఇవ్వడం జరిగింది. మీకు నిద్రలేమి సమస్య ఉంటె వెంటనే డాక్టర్ని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి