నిద్ర పట్టడానికి చిట్కాలు : ఇలా చేస్తే రాత్రికి ఖచ్చితంగా నిదుర పోతారు !

నిద్ర పట్టడానికి చిట్కాలు | Nidra Pattadaniki Chitkalu 

ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్య వల్ల బాధపడుతున్నారు. చాల మంది నిద్ర రావటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే 8 గంటల నిద్ర అవసరం.కానీ ఇప్పుడు మనిషి ఉద్యోగం అని, ఇతర కారణాల వలన సరిగా నిద్ర పోవటం లేదు.

మన జీవన విధానంలో కొన్ని మార్పులను చేసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇప్పుడు నిద్ర పట్టడానికి కొన్ని చిట్కాలని తెలుసుకుందాం.

నిద్ర పట్టడానికి చిట్కాలు | నిద్ర పట్టాలంటే ఏం చేయాలి  ?

నిద్ర పట్టడానికి అనేక రకాల చిట్కాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • పడుకునే ముందు రోజు గోరు వెచ్చని పాలలో ఒక స్పూన్ తేనె కలుపుకోని తాగాలి. ఇలా చేయడం వలన హాయిగా నిద్ర వస్తుంది.
  • రాత్రిపూట అరటి పండు తినాలి.ఇలా తినటం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తద్వారా హాయిగా నిద్ర పడుతుంది.
  • బాదం తినాలి. బాదంలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది నిద్రిస్తున్న సమయంలో రక్తంలోని చక్కెరస్థాయిని నియంత్రించడంలో ఎంతగానో సాయపడుతుంది.
  • చేపలు తినటం ఆరోగ్యానికి చాల మంచిది.ఇవి తినటం వలన కూడా నిద్ర బాగా వస్తుంది.
  • బఠానీలు బాగా తినటం వలన నిద్ర హాయిగా వస్తుంది.ఈ బఠానీలో నిద్రకు సంబంధించిన పోషకాలు అధికంగా ఉంటాయి.
  • ఆకూకురాలని ఎక్కువగా తినటం వలన నిద్రలేమి సమస్య చాల దగ్గుతుంది. ఈ సమస్య ఉన్నవారు రెండు రోజులకి ఒకసారి ఆకూకురాలని తింటే చాల మంచిది.
  • రాత్రి పడుకునే ముందు కొంచం సేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలి.
  • పడుకునే ముందు టివిని చూడరాదు.
  • గసగాసలని దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన నిద్ర బాగా వస్తుంది.
  • పడుకునే ముందు మీకు నచ్చిన దృశ్యాలను ఉహించుకోవాలి.
  • పడుకునే ముందు మొబైల్ చూడకూడదు.
  • రాత్రి పడుకునే ముందు మీకు నచ్చిన సంగీతాన్ని వింటూ ప్రశాంతగా పడుకోవాలి.
  • పడుకునే ముందు చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి.
  • పడుకునే ముందు కాఫీ, టి వంటివి తాగరాదు.
  • పడుకోవటానికి గంట ముందు వేడి నీళ్ళతో స్నానం చేసుకోవాలి. ఇలా చేయటం వలన శరీరం రిలాక్స్ అవుతుంది.దీని వల్ల హాయిగా నిద్ర పడుతుంది.
  • తేలికైన ఆహారాన్ని రాత్రి పూట తినాలి.
  • రాత్రి సమయంలో భోజనానికి పడుకోవటానికి మధ్య కనీసం గంట వ్యవధి ఉండేలా చూసుకోవటం.
  • పడుకోవటానికి అరగంట ముందు కొంచం సేపు నడవాలి.
  • పడుకునే ముందు గ్రీన్ టి తాగటం ఆరోగ్యానికి చాల మంచిది.
  • సాయత్రం పూట క్రైమ్ న్యూస్లు చూడకూడదు.ఎందుకంటె అవి నిద్రలోకి వచ్చి మెలుకువ వచ్చేల చేస్తాయి.కాబట్టి సాయంత్రం మంచి నవ్వు తెప్పించే షోలను చూడాలి.
  • రాత్రి భోజనంలో మజ్జిగ తీసుకోవడం వలన  కూడా చక్కగా నిద్ర పడుతుంది.
    మజ్జిగలో ఉండే ట్రిప్టోఫాన్ నిద్రను ప్రేరేపించడం జరుగుతుంది
  • పడక గదిలో వెలుతురు తక్కువ ఉండేలా చూసుకోవాలి.
  • పడుకొనే ముందుగా కూల్ వాటర్ తీసుకోవడం వలన కూడా రాత్రిపూట బాగా  నిద్ర పడుతుంది.
  • పడుకొనే ముందుగా కూల్ వాటర్ తీసుకోవడం వల్ల రాత్రిపూట నిద్ర పడుతుంది.

నిద్రపట్టక పోవటానికి కారణాలు | Nidra Pattaka Povataniki Karanalu

నిద్ర పట్టక పోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇపుడు మనం తెలుసుకుందాం.

  • పడుకునే ముందు మొబైల్ ఎక్కువగా చూడటం.
  • టివి ఎక్కువగా చూడటం.
  • పగలు ఎక్కువ సమయం నిద్ర పోవటం.
  • ఎక్కువగా పని చేయటం వలన నిద్ర సరిగా రాదు. ఎందుకంటె పని ఎక్కువగా చేస్తే నొప్పులు వస్తాయి.తద్వారా నిద్ర సరిగా రాదు.
  • పడుకునే ముందు ఎక్కువగా ఆలోచించడం.
  • సరిగా తినకపోవటం

గమనిక :- పైన పేర్కొన్న సమాచారం కేవలం మీకు అవగాహనా రావటం కోసం ఇవ్వడం జరిగింది. మీకు నిద్రలేమి సమస్య ఉంటె వెంటనే డాక్టర్ని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి

Related Articles

Latest Articles