ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత

సీనియర్ నటుడు మన్నవ బాలయ్య కన్ను మూశారు. యూసఫ్ గూడ లోని తన నివాసం లో తుది శ్వాస విడిచారు. అయన మృతి తో తెలుగు సిని పరిశ్రమ విషాదం లో మునిగి పోయింది. అయన మృతి పట్ల గురించి తెల్సుకొన్న సిని ప్రముఖులు తీవ్ర భాద లో ఉన్నారు. అయన ఆత్మ కు శాంతి చేరుకోవాలి అని అందరు కోరుకొంటూ ఉన్నారు. పుట్టిన రోజు అయన మరణించడం విషాద కరం.

అయన వయసులో ఉన్నపుడే సిని పరిశ్రమ లో అడుగు పెట్టారు. అ తర్వాత అయన వెను తిరగ కుండ 350 పైగా సినిమాల్లో నటించాడు.  ‘ఎత్తుకు పై ఎత్తు’ తో మొదటి సినిమాతో సిని పరిశ్రమ లో కి అడుగు పెడతారు. పార్వతి కళ్యాణ, ఇరుగు పొరుగు, బొబ్బిలి యుధం, పాండవ వనవాసం, మొనగాళ్ళకు మొనగాడు.

శ్రీ కృష్ణ పాండవీయం, విక్రమార్క విజయం, అల్లూరి సీతారామరాజు, ప్రాణ స్నేహితుడు, మహా రాజశ్రీ మాయగాడు, పెద్దరికం, గాయం, యమలీల, పెళ్లి సందడి, అన్నమయ్య, మన్మథుడు, మల్లేశ్వరి, శ్రీ రామ రాజ్యం వంటి వి ఆయనకు మంచి పేరు తెచ్చాయి.

ఆయన సినిమాల్లో వివిధ పాత్రలో నటిస్తూనే, నిర్మాత గా దర్శకుడిగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు. అమృత ఫిలిం సంస్థ బ్యానర్ పై  చెల్లెలి కాపురం (శోభన్ బాబు ),  నేరం- శిక్ష  (కృష్ణ), చుట్టాలు ఉన్నారు జాగ్రత్త , ఊరికి ఇచ్చిన మాట (చిరంజీవి) వంటి చిత్రాలు నిర్మించాడు.

ఇక దర్శకుడిగా పసుపు తాడు,నిజం చెబితే నేరమ, పోలీసు అల్లుడు తెరకెకించారు. ఊరికి ఇచ్చిన మాట ద్వారా కథ రచయిత గా  నంది అవార్డు అందుకొన్నారు. చెల్లెలి కాపురం సినిమా కి నిర్మాత గా నంది అవార్డు అందుకొన్నారు.

Related Articles

Latest Articles