బాలినేని కి జరిగిన అవమానంతో రాజీనామా చేసే ఆలోచన !

ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అవమానంతో  మండిపోతున్నారు. తనను నమ్మించి మోసం చేశారని ఆయన మండిపడుతున్నారు. ప్రకాశం జిల్లాలో పార్టీని భుజానికి ఎత్తుకుని మోసి పనిచేసిన బాలినేనికి మాజీని చేశారు. దీనితో ఆయన తన కోపాని  దాచుకోలేకపోతున్నారు.

ఇక ఆయన వద్దకు మాట్లాడానికి వచ్చిన సజ్జల రామక్రిష్ణా రెడ్డి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిలతో బాలినేని మాట్లాడుతూ తనను నమ్మించి చివరికి ఏమీ కాకుండా చేశారని మండిపడ్డారని చెప్పినారు. అంతే కాదు మంత్రి పదవి విషయంలో తనను పక్కన పెట్టడం మీద కూడా చాల ఆగ్రహం తో ఉన్నారు.

ప్రకాశం జిల్లాలో బాలినేనికి గట్టి పట్టుంది. ఆయన వర్గంగా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంతో ఆయన వారిని కూడా నచాచేప్పలేక పోతున్నన. తనను సర్దుచేప్పడానికి  వచ్చిన హై కమాండ్ ప్రతినిధులుగా వచ్చిన  సజ్జల రామక్రిష్ణారెడ్డి శ్రీకాంత్ రెడ్డి కూడా బాలినేని పట్టించుకోవడంలేదు. తన నిర్ణయం తనదే అన్నట్లుగా ఆయన వైఖరి ఉందని అంటున్నారు.

ఇక తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను , అని బాలినేని వచ్చిన వారితో స్పష్టంగా చెప్పడంతో చర్చలు విఫలం అయ్యాయనే అంటున్నారు. బాలినేని తీవ్ర నిర్ణయం తీసుకోకుండా చూడాలని పార్టీ హై కమాండ్ నుంచి సూచనలు వచ్చినా చర్చలు మాత్రం సక్సెస్ కాకపోవడంతో సజ్జల రామక్రిష్ణారెడ్డి శ్రీకాంత్ రెడ్డి వెనుతిరగాల్సి వచ్చింది. మొత్తానికి బాలినేని తన నిర్ణయం త్వరలోనే తీసుకుంటాను అని అంటున్నారు.

వైసిపి నాయకులు బలనేని నచాచేప్పడ నికి ప్రయత్నం చేస్తున్నారు, తను ఎం చెప్పుతారు అని వైసిపి నాయకులూ వేచిచూస్తున్నారు,బాలినేని వ్యవహారం చూస్తే వైసీపీ  హై కమాండ్ కి షాక్ ఇచ్చేలా ఉందని అంటున్నారు. బాలినేనిని బుజ్జగించి దారికి తెచ్చే మార్గాలను పార్టీ పెద్దలు వెతుకుతున్నారు. మొత్తానికి బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఆయన ఏమి చేస్తారో చూడాలి.

Related Articles

Latest Articles