Badminton Asia Championships సెమిస్ లో సింధు

Badminton Asia Championships Semi Final సెమిస్ లో సింధుభారత Badminton స్టార్   పీవీ సింధు సెమీస్‌లోకి దుసుకువెళ్ళింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రెండు ఒలింపిక్ పతకాల  పోరులో పీవీ సింధు మరో మెడల్ కోసం పోరాడుతూ ఉంది.

ఈ టోర్నీలో సింధు క్వార్టర్ ఫైనల్లో నుంచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం (ఏప్రిల్ 30) మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో నాల్గో సీడ్‌ సింధు 21-9, 13-21, 21-19తో ఐదో సీడ్‌ హి బింగ్జియావో (చైనా)పై గెలిచింది. ఆసియాలో టోర్నీలో సింధు చేతిలో చేరిన రెండో పతకం.

అయితే దీని కన్నా ముందు సింధు తొలి సారిగా  2014 జిమ్‌చన్‌ దక్షిణ కొరియా ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సింధు మొదటిసారిగా కాంస్య పతకాన్ని సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరుకు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కొన్ని పథకాలు సాదించింది.

ఇక సింధు ఈ ఆసియ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌లో గెలిస్తే.. ఆసియా టోర్నీలో మంచి  ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత క్రీడాకారిణిగా సింధు నిలువనుంది. సైనా నెహ్వాల్‌ (2010 ఢిల్లీ, 2016 వుహాన్‌, 2018 వుహాన్‌) మూడుసార్లు కాంస్య పతకాలనే కైవసం చేసుకుంది.

ఇందులో సింధు ఒకటి గోల్డ్ అయితే మరొకటి రజతం, 7 కాంస్యం పతకాలు సాదించింది.క్వార్టర్స్‌లో చైనా బింగ్జియావోపై 7-9తో బరిలో దిగిన సింధు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. గంటా 16 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో పీవీ సింధు మరింత దూకుడును కనబర్చగలిగింది.

మొదటి రౌండ్లో చాల బాగా ఆడింది. ఇందులో తను స్మాష్‌లు, హాఫ్‌ స్మాష్‌లు, బాడీ స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్‌ షాట్‌లు, నెట్‌ సాధికారిక డ్రిబ్లింగ్‌తో సహా సింధు ఉపయోగించి ఆటను తన వైపుకు తిప్పుకొంది.ఫలితంగా 4-2తో గేమ్‌ను సింధు 11-2తో ముందు అడుగు వేసింది.

21-9తో తొలి గేమ్‌ సింధు గెలిచింది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి ముందు అడుగు వేయగా  సింధుపై ఎదురుదాడి చేస్తూ 6-4తో ఆధిక్యం సంపాదించింది. సింధు గట్టిగా పోరాడి 10-9తో ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధించగలిగింది.

గెలవల్చిన మూడో గేమ్‌ సింధు మరింత ముందు అడుగు వేసింది. సింధు షాట్లు ఆడుతూ 20-16తో మ్యాచ్‌ పాయింటుకు చేరుకుంది. బింగ్జియావో వరుసగా 3 పాయింట్లతో మ్యాచ్‌ పై అంచనాలను పెంచేయడంతో ఒక్క పాయింటుతో సింధు (21-19) మూడో గేమ్‌ను కైవసం చేసుకుంది సింధు.

ఇవే కాకుండా ఇంకా చదవండి

  1. బీసీసీఐ సరి కొత్త నిబంధన – నిరాశ లో క్రికెట్ అభిమానులు
  2. ఐపీఎల్ ఫాస్టెస్ట్ 50 – నలుగుర్లో ముగ్గురు KKR బాట్స్మెన్
  3. జూనియర్ హాకీ చాంపియన్స్ షిప్– సెమి ఫైనల్లో భారత్

Related Articles

Latest Articles