కౌంటీ చాంపియన్‌షిప్‌లో పుజారా హ్యాట్రిక్ సెంచరీ
ఇండియన్ టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆదర్గోడుతునాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా నిన్న డుర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా మూడో శతకాన్ని నమోదు చేశాడు. 162 బంతుల్లో 13 బౌండరీలతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అంతకుముందు వోర్సెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ (109) బాదిన పుజారా, డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా డబుల్ సెంచరీ (201) పరుగులు చేశాడు. ఫలితంగా కౌంటీ చాంపియన్‌షిప్‌లో డబుల్ సెంచరీ నమోదు చేసిన రెండో ఇండియన్ బ్యాటర్‌గా పుజారా రికార్డు సృష్టించాడు.
అంతకుముందు మహమ్మద్ అజారుద్దీన్ ఈ ఘనత సాధించాడు. 1991లో లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 212 పరుగులు సాధించిన అజర్.. 1994లో డుర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 205 పరుగులు చేశాడు.
ఈ రెండు సార్లు అజర్ డెర్బీషైర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని పుజారా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీల్లో ఆడుతున్నాడు.
ఈ విధముగా చతేశ్వర్ పుజారా టెస్ట్ మ్యాచ్లలో కొన్ని శతకాలతో అందరిని ఆకట్టుకొన్నాడు. టెస్ట్లో తన మంచి పేరు సంపాదించాడు. ద్రావిడ్ తర్వాత టెస్ట్ మ్యాచ్ లో బాగా ఆడే వాడిగా పేరు తెచ్చుకొన్నాడు. ఇతను కొన్ని వన్ డే మ్యాచ్ లు కూడా ఆడాడు.
అతను టెస్ట్ క్రికెట్లో 6713 పరుగులతో అతి తక్కువ సమయములో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే 95 టెస్ట్ మ్యాచ్ లు లో అతి తక్కువ మ్యాచ్ లలో ఎక్కువ పరుగులు చేసి రికార్డు కొట్టాడు.
ఇవే కాక ఇంకా చదవండి