ఎండాకాలం మీ ముఖం తెల్లగా మెరవాలంటే ఏం చేయాలి !

ఎండాకాలం బయటకి పోవాలి అంటేనే బయపడుతారు, ఎందుకు అంటే వాళ్ళ ముఖం నల్లగా మారుతుంది అని ఎవరు బయటకి వెళ్లారు.ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలని చాల ట్రై చేస్తారు మార్కెట్ లో ఉండే వస్తువ్లతో వాళ్ళ ముఖానికి రాసుకోవడం వంటిది చేస్తారు. ఇంటిలో ఉండే పదార్థాలతో కూడా కొంత మంది ముఖనికి కలసినవి చేసుకొంటారు.                                                                          వాళ్ళ ముఖం నల్లగా మారకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు :-   

 ముఖానికి కవర్ చేయడం:-

మీ చర్మాన్ని కవర్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు చర్మాన్ని కవర్ చేసుకోండి. కేవలం వేసవికాలం వరకు కొంచెం మీరు మీ యొక్క స్కిన్‌ని కవర్ చేసుకుంటూ ఉంటే మంచిది. దీంతో సన్ లైట్ డైరెక్ట్‌గా చర్మంపై పడదు. చర్మానికి కూడా ఇలాంటి సమస్యలు కలగవు కాబట్టి మీరు బయటకు వెళ్లేటప్పుడు గొడుగుని తీసుకువెళ్లడం మర్చిపోకండి. అలానే ఎండాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్‌ని కూడా ధరించండి. పెద్ద టోపీ ఒకటి కొనుగోలు చేసి వాడుతూ ఉండండి. ఇలాంటి చిట్కాలు ఫాలో అయితే కాస్త ఇబ్బంది తగ్గుతుంది. పైగా చర్మంపై ఎలాంటి సమస్యలు కలగవు.

లోషన్స్ మొఖానికి రాయడం :-

వేసవి వచ్చిందంటే చాలా మంది సన్ స్క్రీన్ లోషన్‌ని తప్పక వాడతారు. సన్ స్క్రీన్ లోషన్‌ని రాసుకోవడం వల్ల చర్మానికి సమస్యలు తగ్గుతాయి. అయితే మీరు సన్‌స్క్రీన్ లోషన్‌ని కొనుగోలు చేసేటప్పుడు ఎస్పీఎఫ్ 30 లేదా అంత కంటే ఎక్కువ ఉన్న దాన్ని కొనుగోలు చేయండి.  

ముఖం నీ కడగడం :-

సెన్సిటివ్ స్కిన్ వాళ్లు వేసవి‌కాలంలో ముఖాన్ని ఒకసారి కంటే ఎక్కువ సార్లు కడుక్కోవడం కూడా మంచిదే. కాలుష్యం కారణంగా చర్మానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అయితే మీరు కాలుష్యం మొదలైన వంటి వాటి వల్ల కలిగే ఇబ్బందులు తొలగించుకోవడానికి ముఖాన్ని తరచూ కడుక్కుంటూ ఉండండి అలానే మీరు ఎక్కువ కెమికల్స్ ను ఉపయోగించద్దు. కెమికల్స్ ఉండే వాటిని ఎక్కువగా వాడడం వల్ల ఎలర్జీలు వంటి సమస్యలు కలుగుతాయి. అదే విధంగా హార్ష్ స్క్రబ్ వంటి వాటికి దూరంగా ఉండండి. ఇది కూడా చాలా ముఖ్యం. కాబట్టి తప్పని సరిగా వీటిని కూడా ఫాలో అవుతూ ఉండండి.

శక్తివంతంగా ఉండడం:                                                                                                         చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే హైడ్రేట్‌గా ఉండటం కూడా చాలా ముఖ్యం. నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. వేసవిలో చెమట ఎక్కువ పడుతుంది దీంతో ఎక్కువ నీళ్ళు ఒంట్లో నుంచి వెళ్లిపోతాయి. కాబట్టి ప్రతి రోజూ ఏడు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల హైడ్రేట్‌గా ఉండొచ్చు. అదే విధంగా వేసవిలో కూరగాయలు పండ్లు కూడా ఎక్కువగా తీసుకోండి. ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల కూడా మీ చర్మం హైడ్రేట్ గా ఉంటుంది.

 

 

Related Articles

Latest Articles