సూపర్ స్టార్ కృష్ణ ఫొటో వైరల్ ..

కృష్ణ ఎన్నో చిత్రాలలో నటించారు. వారు నటించిన చిత్రాలు అన్ని చూడడానికి బాగున్నై, (పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి) తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు.

1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమాతేనెమనసులు మూడవ సినిమా గూడచార116  పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి. ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు.

1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశాడు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత  పద్మాలయ స్టూడియో లో నెలకొల్పాడు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశాడు.

‌‌ కృష్ణ.. కానీ సినీ ప్రేక్షకులకు మాత్రం సూపర్‌స్టార్ డ. హీరోగా, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా 1970-80 దశకాల్లో తిరుగులేని అభిమానాన్ని సాధించుకున్నారు. 1964కు ముందు అనేక సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసిన ఆయన తేనె మనసులు, గూఢచారి 116 సినిమాలతో హీరోగా నిలదొక్కుకున్నారు.

1970లో పద్మాలయా సంస్థను స్థాపించి పలు విజయవంతమైన సినిమాలు తీశారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశారు. అయితే సినీ ఇండస్ట్రీలో టాప్‌ హీరోలుగా కొనసాగున్న సమయంలోనే ఎన్టీఆర్‌ పేరెత్తితేనే కృష్ణ మండిపడేవారంట.

ఎన్టీఆర్‌‌పై కోపంతో చేసిన ఒక్క పనివల్ల కృష్ణ నటించిన ‘కంచు కవచం’ సినిమా కష్టాల్లో పడింది. ఆ సినిమా విడుదల సమయంలో పోలీసులు ఏకంగా 144 సెక్షన్ విధించడం కొసమెరుపు. ఈ వివరాలేంటో తెలుసుకుందాం..

కృష్ణ ఫొటో వైరల్

సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారడం.. అందులో ఆయన ముఖంలో కొన్ని తేడాలు కనిపించడంతో… కృష్ణకు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వయోభారం కారణంగా కృష్ణ పెద్దగా బయటకు రావట్లేదు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్లకు మాత్రమే హాజరవుతున్నారు.

ఈ క్రమంలో ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణ ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. అక్కడ తన సోదరుడు ఆది శేషగిరిరావుతో కలిసి భోజనం చేస్తుండగా తీసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఆ ఫోటో తీసింది మరెవరో కాదు.. కృష్ణ తనయ మంజుల. ఆ ఫోటోలో కృష్ణ ముఖమంతా తెల్లని మచ్చలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. అది చూసిన ఫ్యాన్స్ ఆయన ముఖానికి ఏమైంది… ఎందుకలా అయ్యారని ఆందోళన చెందుతున్నారు. కృష్ణకు ఏమైందంటూ సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు.

అయితే ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నట్లుగా కృష్ణకు ఏమీ కాలేదు. ముఖానికి ఇన్విజిబుల్ మాస్క్ ధరించడం వల్ల.. ఫోటోలో అది చర్మంలో కలిసిపోయినట్లుగా కనిపించింది. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్యంగా ఉన్నారని… ఎంతో చురుగ్గా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఇటీవల ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ఫోటో ఒకటి ఇలాగే వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అందులో ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో ఆయనకేమైందని చాలామంది ఆందోళన చెందారు.

చివరకు వెంకటేశ్వరారావు  సోదరుడు గోపాలకృష్ణ  దీనిపై తన యూట్యూబ్ చానెల్ ద్వారా స్పందించారు. వయోభారం కారణంగా అలా కనిపిస్తున్నారని… అంతే తప్ప ఆయన ఆరోగ్యానికి ఏమీ కాలేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఆయన చురుగ్గా ఉన్నారని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు.

Related Articles

Latest Articles