ఐపీఎల్ అంటేనే ఫాస్టెస్ట్ 50 లు, సెంచరిలు మరియు హట్రిక్ విక్కెట్లు రికార్డు తిరుగ రాతలు. మరి ముఖ్యంగా కొంత మంది ఆటగాళ్ళు మరింత ఉస్తాహంగా ఐపీఎల్ చూసేలా చేస్తారు. వీళ్ళలో ముఖ్యము గా కోల్‌కతా ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ రికార్డు సమం చేసాడు. ప్రతీకారం అంటే ఈ రేంజ్ లో ఉంటుందా అని కమిన్స్ ముంబై కి చూపించాడు.
ఇది వరకే కేఎల్ రాహుల్ పేరిట ఉన్న ఐపీఎల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును పాట్ కమిన్స్ సమం చేశాడు. ముంబయితో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లో 50 పరుగులు కొట్టి ఐపీఎల్ ఫాస్టెస్ట్ 50 లో కమిన్స్ చేరాడు.
2018లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన కేఎల్ రాహుల్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లో 50 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు. 2021 వరకు కూడా ఆ రికార్డ్‌ను ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.
2022 ఐపీఎల్లో పాట్ కమిన్స్ ముంబయితో జరిగిన మ్యాచ్‌తో రాహుల్ సరసన నిలిచాడు. ఐపీఎల్ లో తక్కువ బంతుల్లో 50 పరుగులు చేసిన ఆటగాళ్లు మొత్తం నలుగురు ఉండ గా వాళ్లల్లో ముగ్గురు కోల్‌కతా జెర్సీతో ఆడినవారే ఉండటం గమనిచావాల్సిన విషయం.
14 బంతుల్లో కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ హాఫ్ సెంచరీ చేయగా.. 15 బంతుల్లో యూసఫ్ పఠాన్, సునీల్ నరైన్ ఫాస్టెస్ట్ 50 చేశారు. కమిన్స్, రాహుల్, యూసఫ్ పఠాన్, సునీల్ నరైన్‌లలో రాహుల్ తప్ప మిగిన్లిన ముగ్గురు ఆటగాళ్ళు కోల్‌కతా నైట్ రైడర్స్‌కి ఆడిన ఆటగాళ్లే అవడం కోల్‌కతా కు కలిసి వచ్చే అంశం.