రోజ్ వాటర్ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయ్, కొన్నింటిని మనం ఇప్పుడు తెలుసు కొందాం.
షీట్ మాస్క్ ని బూస్ట్ చేస్తుంది:-షీట్ మాస్క్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ని పూర్తిగా పొందాలనుకుంటున్నారా? అయితే, ఇలా చేయండి. ఫేస్ క్లెన్స్ చేసిన తరువాత ఒక కాటన్ ప్యాడ్ తీసుకుని రోజ్ వాటర్ ని ఫేస్ కి అప్లై చేయండి. ఆ తరువాత షీట్ మాస్క్ వేసుకోండి. షీట్ మాస్క్ అందించే హైడ్రేటింగ్ బెనిఫిట్స్ ని రోజ్ వాటర్ ఇంకా పెంచుతుంది. షీట్ మాస్క్ రోజ్ వాటర్ ని స్కిన్ లో ఇంకా లోపలికి చొచ్చుకుపోయేలా చేస్తుంది.
ఇన్‌ఫెక్షన్స్ ని ట్రీట్ చేస్తుంది:-చిన్న చిన్న ఇన్‌ఫెక్షన్స్ ని ట్రీట్ చేసే అన్ని నాచురల్ రెమెడీస్ లోనూ రోజ్ వాటర్ ఉంటుంది. ఎందుకంటే, రోజ్ వాటర్ లో పవర్‌ఫుల్ యాంటీ సెప్టిక్, ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవి ఇన్‌ఫెక్షన్స్ ని క్యూర్ చేయడమే కాదు, ప్రివెంట్ చేస్తాయి కూడా.
ఇరిటేట్ అయి ఉన్న స్కిన్ ని నెమ్మది పరుస్తుంది :-ఎర్రగా మారిపోయి, ఇరిటేట్ అయిపోయి ఉన్న స్కిన్ ని కూల్ డౌన్ చేయాలంటే రోజ్ వాటర్ మంచి పరిష్కారం. ఇందులో ఉన్న పవర్‌ఫుల్ యాంటీ ఇంఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎగ్జిమా, రొసైకా వంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ని నెమ్మది పరుస్తాయి. యాక్నే, ఎలర్జీల కారణంగా స్కిన్ ఎర్రగా అవుతుంటే కూడా రోజ్ వాటర్ యూజ్ చేయవచ్చు, ఎందుకంటే రోజ్ వాటర్ లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఆ ఎర్ర దనాన్ని తగ్గించి ఈవెన్ కాంప్లెక్షన్ ని తీసుకు వస్తాయి.
యాంటీ ఏజీయింగ్ ప్రాపర్టీస్:-=వయసు కనపడనివ్వకుండా చేయడంలో కూడా రోజ్ వాటర్ హెల్ప్ చేస్తుంది. ఇది సెల్ డ్యామేజ్ ని తగ్గిస్తుంది. స్కిన్ ఫర్మ్ గా ఉండేలా చేస్తుంది, ముడతలు రానివ్వదు. యూత్‌ఫుల్ గ్లో ఉండేలా చేస్తుంది.
టోనర్ లా యూజ్ చయండి:-రోజ్ వాటర్ ని టోనర్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సీబం ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా రోజ్ వాటర్ ప్రివెంట్ చేస్తుంది. డ్రై స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఒక కాటన్ ప్యాడ్ మీద వేసి ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు. లేదా ఫేస్ మిస్ట్ లా యూజ్ చేయవచ్చు. సమ్మర్ లో బాగా ఎక్కువగా బయట తిరగాల్సిన పని ఉన్నప్పుడు మీతో పాటు చిన్న బాటిల్ లో రోజ్ వాటర్ తీసుకు వెళ్ళండి. అప్పుడప్పుడూ స్ప్రే చేసుకుంటూ ఉంటే, హాయిగా ఉంటుంది.
మేకప్ ని రిఫ్రెష్ చేస్తుంది:-రోజ్ వాటర్ కేవలం స్కిన్ కేర్ రొటీన్ లో మాత్రమే కాదు, మేకప్ కిట్ లో కూడా తప్పని సరిగా ఉండవలసినదే. మేకప్ ముందు రోజ్ వాటర్ స్ప్రిట్జ్ చేసి మేకప్ వేసుకోవచ్చు, మేకప్ వేసి చాలా సేపైన తరువాత కొంచెం రిఫ్రెషింగ్ గా అనిపించాలంటే రోజ్ వాటర్ స్ప్రిట్జ్ చేసుకోవచ్చు.
ఫేస్ మాస్క్ లో యూజ్ చేయండి:-మీరు ఇంట్లో తయారు చేసిన ఫేస్ మాస్క్స్ వాడుతున్నట్లైతే ఈ సారి ఫేస్ మాస్క్ తయారు చేసుకున్నప్పుడు నీరు బదులు రోజ్ వాటర్ యూజ్ చేయండి, తేడా మీకే తెలుస్తుంది.
పైనపేర్కొన్నవి అన్ని వాడి చుడండి మంచి ఫలితం వస్తుంది.