ఆర్ కే రోజా చంద్ర బాబు పై వేతిరేకంగా వ్యాక్యాలు మాట్లాడినది.ఏపీ మంత్రి రోజా టీడీపీ అధినేత చంద్రబాబు…లోకేష్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. టీడీపీది మహిళా ద్రోహి పార్టీగా పేర్కొన్నారు. మహిళల పైన దాడులు చేసిన వారి పైన ఎటువంటి చర్యలు చంద్రబాబు హాయంలో తీసుకోలేదని విమర్శించారు.
మహిళా సాధికారత దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని చెప్పుకొచ్చారు. తప్పు చేసిన వారిని 24 గంటల్లోనే అరెస్ట్ చేస్తున్నామన్నారు. తప్పు చేసిన వారిని తన హాయంలో చంద్రబాబు రక్షించారని ఆరోపించారు. బూతు పరాణాలతో..అనవసరపు విమర్శలతో రెచ్చగొట్టవద్దని చెప్పినారు.
సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 75 శాతం భాగం మహిళలదే అని రోజా చెప్పుకొచ్చారు. తమది మహిళ పక్షపాత ప్రభుత్వంగా పేర్కొన్నారు. సీఎం జగన్ మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలియచేసారు.
హీరో బాలయ్య చేసిన వ్యాఖ్యలను రోజా మరోసారి ప్రస్తావించారు. టీడీపీలో ఉన్న ఉన్మాదులు ఏ పార్టీలో లేరంటూ ఫైర్ అయ్యారు. చీరలు కట్టుకోవాల్సింది కొడుకును గెలిపించలేదని చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
పట్టు చీర కావాలా పసుపు చీర కావాలో తేల్చుకోవాలంటూ మాట్లాడింది. జగన్ దమ్ము గురించి మాట్లాడుతున్నారని..ఇప్పటికే జగన్ దమ్ము గురించి టీడీపీ నేతలు చూసారని చెప్పుకొచ్చారు. ఒక్క సీటుతో ప్రారంభించి 151 సీట్లు గెలిచిన సత్తా జగన్ ది అన్నారు.
సొంత నియోజకవర్గంలోనూ అన్ని ఎన్నికల్లో ఓడి..ఈ సారి పోటీకి అర్హత లేకుండా పోయిన నేత చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ .. 420 హిస్టరీ అంటూ ఫైర్ అయ్యారు. అచ్చెన్నాయుడు మహిళలను బూటు కాలితో తంతాడని ఆరోపించారు. తాను చేసిన మంచి గురించి చెప్పుతూ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి చంద్రబాబుదని ఎద్దేవా చేసారు.
పొత్తులు నీతి మాలిన రాజకీయాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్.. భారతి..విజయమ్మ గురించి ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని రోజా హెచ్చరించారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పైన చంద్రాబాబు వ్యవహరించిన తీరు పైన రోజా ఫైర్ అయ్యారు.
చివరిలో రోజా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని రోజా చెప్పుకొచ్చారు.