పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1990 లో మంచి ప్రేమ కథ చిత్రలో నటించాడు, అవి చాల మంచి పేరు తెచ్చి పెట్టాయి.అప్పుడు వచ్చిన సినిమాల్లో తమ్ముడు, తొలి ప్రేమ సినిమాలు యూత్ కి చాల బాగా కనెక్ట్ అయ్యాయి.
పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఖుషి ఓ స్పెషల్ మూవీ. ఆ రోజుల్లో యువతను ఓ ఊపు ఊపిన చిత్రమది. పవన్ కెరీర్ లో అతిపెద్ద విజయంగా ఉన్న ఖుషి నేటికి 21ఏళ్ళు పూర్తి చేసుకుంది.
లవ్, రొమాన్స్, ఎమోషన్స్, కామెడీ, సాంగ్స్, యాక్షన్ అన్నీ కలగలిపి ఓ కంప్లీట్ మూవీగా ఖుషి(Kushi) తెరకెక్కించారు. వరుస విజయాలతో జోరు మీదున్న పవన్ ఇమేజ్ ని మరోస్థాయికి తీసుకెళ్లింది. పవన్ ఒక్క దెబ్బతో స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు.
యూత్ లో విపరీతమైన క్రేజ్ ఈ చిత్రంతో సొంతం చేసుకున్నారు. గోకులంలో సీత చిత్రం తర్వాత విడుదలైన సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి మంచి విజయాలందుకున్నాయి.
ఖుషి తమిళ హిట్ మూవీ ఖుషి రీమేక్. తమిళంలో విజయ్, జ్యోతిక జంటగా నటించారు. ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన ఎస్ జె సూర్య తెలుగు వర్షన్ కి కూడా దర్శకత్వం వహించారు. ఏ ఎం రత్నం నిర్మాత. పవన్ కి జంటగా భూమిక(Bhumika)ను ఎంపిక చేశారు.
సమ్మర్ కానుకగా 2001 ఏప్రిల్ 27న విడుదలైంది. ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్. పవన్-భూమిక కెమిస్ట్రీ సినిమాలో అద్భుతంగా పండింది. భూమిక నడుము సన్నివేశం ఎవర్ గ్రీన్ రొమాంటిక్ సన్నివేశంగా మిగిలిపోయింది. మణిశర్మ సాంగ్స్ సినిమా విజయంలో కీలక పాత్ర వహించాయి.