సిద్ద పాత్రకు చరణ్ న్యాయం చేసాడు

గత కొన్ని రోజులుగా పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈప్పుడు పాన్ ఇండియా మూవీస్ పరంపర కొనసాగుతోంది. నెల క్రితం రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా మరియు వారం రోజుల ముందు రిలీజ్ అయిన కేజీఫ్ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

అలాగే ఈ నెల చివరి లో రాబోతున్న ఆచార్య మూవీ హై expectation తో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసం చాల మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కారణము ఇందులో చిరంజీవి మరియు తన తనయుడు రామ్ చరణ్ నటించడమే.

విడుదలకు కొన్నిరోజులే ఉండడంతో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది మూవీ టీమ్. చిరు, చరణ్‌లను ఒకే స్టేజిపై  చూస్తూ మెగా అభిమానులు సంబరపడుతున్నారు. అయితే ఆచార్యలో రామ్ చరణ్.. సిద్ధ పాత్రకు ఒప్పుకోకపోయింటే ఇంకెవరు చేసేవారో చిరంజీవి రివీల్ చేశారు.

ఆచార్య చిత్రంలో చిరంజీవి.. ఆచార్య పాత్రలో కనిపించగా రామ్ చరణ్.. సిద్ధ అనే పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయిన రాజమౌళి చరణ్ ను ఆచార్య కోసం కొద్ది రోజులు టైం ఇచ్చాడు.

ఇక చరణ్ సిద్ద పాత్ర చేయక పోయి ఉంటె ఎవరు చేసే వారు అని అడగగా, దానికి చిరంజీవి చరణ్ అయితే 100% న్యాయం చేస్తాడని చరణ్ చేయక పోతే మాత్రం దీనికి కరెక్ట్ గా suit అయ్యేది ఒక్క పవన్ కళ్యాణ్ కే అని చిరంజీవి చెప్పాడు.

ఇది విన్న అభిమానులు ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే చాలా బాగుండేదని జస్ట్ మిస్ అయ్యిందని అనుకుంటున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను ఎప్పుడూ ఒకే వేదికపై చూడాలని ఆశపడే మెగా అభిమానులకు వీరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఫుల్ ఫీస్ట్ అవుతుంది.

Related Articles

Latest Articles