సమంతా తన ఫొటోనీ డిలిట్ చేయడానికి కారణం ఏమిటి !

సమంత.. ఈ పేరుకు అంత పరిచయం అవసరం లేదు. ఎందుకు అంటే ఎప్పటి నుండే మన తెలుగు ప్రేక్షకులకి తెలిసిన ముద్ద గుమ్మ ఎన్నో సినిమాలలో మన అందరిని అలరించిన సమంతా, తీసిన అన్ని సినిమాలు మంచి హిట్ అయ్యాయి.

సమంతా తెలుగు, తమిల్, మలయాళం వంటి వివిధ భాషలలో నటించడం జరిగింది. మన తెలుగు భాషలో కాకుండా ఇతర భాషలో కూడా శ్యాం కి మంచి పేరు ఉంది.

ఈ మధ్య వచ్చిన పుష్ప పార్ట్ 1 సినిమాలో ఐటెం సాంగ్ అమ్మాయిగా, వు అంటావా మావా పాటతో మంచి పేరు సాధించింది. ఇలా ఎన్నో సినిమాలు నటించి తనకంటూ మంచి గుర్తింపు సాధించింది. సినిమాల్లో కూడా చాల యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు సమంతా సినిమాలో ఫుల్ బిజీ లైఫ్ గడుపుతుంది.

ఈ మధ్యనే సమంతా ఒక డ్రెస్ లో ఫొటో తీసుకొని డిలీట్ చేయడం జరిగింది. ఆ సంగతి ఏంటో చూద్దాం. టాలీవుడ్ స్టార్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రభు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. విభిన్నమైన పోస్టులు, కొటేషన్లతో అభిమానుల్ని ఆకట్టుకుంటుంటుంది. తాజాగా డెడ్ అంటూ పోస్ట్ పెట్టి సంచలనం రేపింది.

పుష్ప సినిమాలో ఊ అంటావా పాటతో క్రేజీగా మారిన స్టార్ నటి సమంత ప్రభు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటోంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియా అస్సలు ఖాళీ ఉండదు. అభిమానుల్ని సందడి చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు విభిన్నమైన పోస్టులు, వ్యాఖ్యలు, మోటివేషన్ కొటేషన్లతో బిజీగా ఉంటుంది, అభిమానుల్ని ఆకట్టుకుంటుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో డెడ్ అంటూ ఓ స్టోరీ పెట్టి సంచలనం రేపింది. అసలేం జరిగింది.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్శ్ నుంచి థోర్ సిరీస్ నాలుగవ మూవీ థోర్ లవ్ అండ్ థండర్ సినిమా త్వరలో విడుదల కానుంది. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ చూసిన సమంతా  ప్రభు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో డెడ్ అని రాసి ఈమోజీలతో థోర్ సినిమా పోస్టర్ షేర్ చేసింది. డెడ్ అని పెట్టడంతో కాస్సేపటికే వైరల్ కాసాగింది. అయితే మరి కాస్సేపటికి ఆ పోస్ట్ కన్పించలేదు.

ఆ స్థానంలో థోర్ సినిమాలో సూపర్ విలన్ బాలే లుక్ షేర్ చేస్తూ ది గాడ్ ఆఫ్ యాక్టింగ్ అని రాసింది. క్రిస్టియన్ బాలే ది డార్క్ నైట్, ది డార్క్ నైట్ రైజెస్ సినిమాల్లో బ్యాట్‌మ్యాన్‌గా అదరగొట్టాడు. ప్రస్తుతం విలన్‌గా చేస్తున్నాడు. డెడ్ అనే పోస్ట్ సమంత ఎందుకు డిలీట్ చేసిందనేది తెలియలేదు, అసలు డెడ్ అని ఎందుకు పెట్టిందనేది చర్చనీయాంశమైంది.

Related Articles

Latest Articles