విజయ్ హీరో గా కాకుండా ప్రేక్షకుడిగా ఆలోచిస్తారు

విజయ్ గారు బీస్ట్ వంటి విలువైన కథని ఎంచుకోవడం చాల ఆసక్తికరం, కథ వినేటప్పుడు ఆయన ఓ స్టార్‌ హీరోలా కాకుండా ప్రేక్షకునిగా ఆలోచిస్తారు. తన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో ఆలోచించి కథలు ఎంచుకుంటారు.

అలాంటి మూవీ నే ”బీస్ట్” నిర్మాత అయ్యిన దిల్ రాజు వారి మాటలలో తెలిపారు, పూజా హెగ్డే జంటగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ  ‘బీస్ట్‌’. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ తమిళ సినిమా ఈ నెల 13న విడుదలవుతోంది.

ఈ మూవీ ని కూడా తెలుగు దర్శకుడు అయ్యిన దిల్ రాజు ‘బీస్ట్‌’ పేరుతోనే శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌పై తెలుగు లో విడుదల కన్నుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ.. ‘‘నెల్సన్‌ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు.

కొలమావు కోకిల, డాక్టర్‌’ వంటి వైవిధ్యమైన చిత్రాలు తీసిన ఆయన మూడో సినిమాకే విజయ్‌గారితో పనిచేసే అవకాశం అందుకోవడం గ్రేట్‌. విజయ్‌గారి 66వ సినిమాని మా బ్యానర్‌లో నిర్మిస్తుండటం సంతోషంగా ఉంది. పూజా హెగ్డే ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌ అవడం హ్యాపీ’’ అన్నారు.

‘‘బీస్ట్‌’ సినిమా ట్రైలర్స్, మ్యూజిక్‌కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి స్పందన వస్తోంది’’ అన్నారు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌. ‘‘కత్తి, మాస్టర్‌’ చిత్రాల తర్వాత విజయ్‌ సార్‌తో నేను చేసిన హాట్రిక్‌ ఫిల్మ్‌ ‘బీస్ట్‌’. నన్ను ఇంతగా అభిమానిస్తున్న తెలుగు వారి కోసం టాలీవుడ్‌లో చాలా సినిమాలు చేస్తానని మాట ఇస్తున్నా’’ అని.

సంగిత దర్శకుడు అనిరుధ్‌ అన్నారు. పూజా హెగ్డే మాట్లాడుతూ తమిళ సినిమాతో నా ప్రయాణం ప్రారంభమైనా ఇన్నేళ్లకు ‘బీస్ట్‌’ లాంటి సినిమాతో మళ్లీ తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సంతోషంగా ఉందిఅని వేక్తం చేసింది.  ఫుల్ మూవీ చూడడానికి చాల బాగుంది అని అన్నారు  విజయ్‌ సార్‌ ఓ స్టార్హీరో అయినా చాలా కష్టపడతారు. అదే నాలో కూడా సుర్తి నిచింది. ఈ సందర్బంగా పూజ తెలియచేయడం జరిగింది.

Related Articles

Latest Articles