రెండు భాగాలుగా సలార్ క్లైమాక్స్‌ సీన్ కోసం కొన్ని వందల కోట్లు

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తో తను పాన్ ఇండియన్ స్టార్ గా తన పేరు ను పెంచుకొన్నాడు. అలాగే అతను నటించిన ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలే వస్తునాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన రాదే శ్యాం అంతకు ముందు వచ్చిన సాహో మూవీలు బాగా లేక పోయిన తన స్టార్ ఇమేజ్ మాత్రం తగ్గడం లేదు.

ఇక పోతే హిందీలో సాహో సినిమా సూపర్ హిట్ మరియు రాదే శ్యాం కూడా హిట్ అయ్యింది.తెలుగు లో మాత్రమే ఈ సినిమాలు ఫ్లోప్  అయ్యాయి.ఇక ప్రభాస్ రాబోయే సినిమా సలార్ మూవీ భారి అంచనాలతో మీ ముందుకు వస్తుంది.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తన్న కొత్త సినిమా సలార్(Salaar). కేజీఎఫ్(KGF) డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తీస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజగా కేజీఎఫ్ విడుదల పూర్తవ్వడంతో ఇప్పుడు ప్రశాంత్ సలార్ పై దృష్టి పెట్టాడు.

సలార్ షూటింగ్ ఫుల్ స్వింగులో ఉంది. ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతోన్న సలార్(Salaar) సినిమా ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందనే టాక్ ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ వార్త ట్విట్టర్‌‌ను షేక్ చేస్తోంది.

ఇక సలార్ లోని ప్రీ క్లైమాక్స్ సన్నివేశాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఓ సీన్ కోసం ఏకంగా కోట్లలో ఖర్చు పెట్టబోతోన్నాడట ప్రశాంత్ నీల్. మొదట్లో ఆ సన్నివేశంకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో పది కోట్లు ఖర్చు చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడు.

అయితే ఇప్పుడు కేజిఎఫ్ 2  సినిమా సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో  20 కోట్ల రూపాయలను ఆ ఒక్క ప్రీ క్లైమాక్స్ సన్నివేశానికి ఖర్చు చేయబోతున్నారని సమాచారం. మరోవైపు సలార్ మూవీలో ప్రభాస్ అత్యంత క్రూరంగా కనిపించబోతోన్నాడట.

ఈ చిత్రం నుంచి శ్రుతీ హాసన్  పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆద్య పాత్రలో శ్రుతీ హాసన్ కనిపించబోతోంది.కేజీఎఫ్ 2’ను నిర్మించిన హోంబలే ఫిలింస్ సంస్థ ప్రస్తుతం ‘సలార్’ను నిర్మిస్తోంది. కనుక బడ్జెట్ విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా కనిపించబోతుంది. ఇక ప్రభాస్, శృతి హాసన్‌ల మధ్య సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు డార్లింగ్ ప్రభాస్ సలార్‌తో పాటు ఆదిపురుష్(Aadipurush), ప్రాజెక్ట్ కే(Project K) సినిమాలు కూడా చేస్తున్నారు .

ఇక ప్రభాస్, శృతి హాసన్‌ల మధ్య సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు డార్లింగ్ ప్రభాస్ సలార్‌తో పాటు ఆదిపురుష్(Aadipurush), ప్రాజెక్ట్ కే(Project K) సినిమాలు కూడా చేస్తున్నారు .

Related Articles

Latest Articles