ఈ మద్య కాలములో చిరంజీవి వరుస సినిమాలతో దూసుకు పోతునాడు. ఇదే సమయములో తన కొడుకు చరణ్ తో కలిసి నటిస్తోన ఆచార్య సినిమా గురించి చెప్తూ ఎమోషనల్ అయిన చరణ్. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ గా కొరటాల శివ వ్య్వహరిస్తునాడు.
ఈ సందర్భములో చిరంజీవి మరియు అతని తనయుడు రాం చరణ్ ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్నారు. తన తండ్రితో కలిసి నటించిన ఆచార్య సినిమా గురించి మాట్లాడుకొన్నారు. ఈ సినిమాలో మా నాన్న తో కలిసి నటించడం చాల కష్టముగా ఉందని ఆయన అనుభవానికి నేను సరి పోను అని చరణ్ చెప్పాడు.
ఈ సినిమాలో చేస్తున సేపు నాకు చాల ఆనందముగా ఉందని, ఎందుకంటే మా నాన్న నాతో పాటే ప్రతి నిముషము కల్సి ఉన్నాడు. అని బావోద్నానికి లోను అయ్యాను అని చరణ్ చెప్పుకు వచ్చాడు. ఈ విధముగా తన తండ్రి ఎన్నో మంచి సినిమాల్లో నటించిన అనుభవం, ఇప్పుడు ఆయనతో పాటు కలిసి చేయడం చాల సంతోషముగా ఉంది.
ఈ సినిమా షూటింగ్ లో నాన్న కు నాకు ఒకే డబల్ బెడ్ రూమ్ రూము ను ఇచ్చారు. అక్కడ దాదాపు 20 రోజులు నేను నాన్న కల్సి బోజనము చేసి, షూటింగ్ తర్వాత విశ్రాంతి తీసుకోని ప్రశాంతముగా పడుకొనే వాళ్ళము.
ఇంకా నేను నాన్న కలిసి పొద్దున్న 5 గంటలకే లేచి వ్యాయామాలు చేసే వాళ్ళము, అలాగే నేను నాన్న ఇద్దరు కలిసి ఒకే కారులో షూటింగ్ కు వెళ్ళే వాళ్ళము. ఈ మదురమైన జ్ఞాపకాలు జీవితము మొత్తం గుర్తు ఉంటాయి అని చరణ్ అన్నాడు.
చిరంజీవి తన కొడుకు తో చరణ్ మనకు ఇటువంటి అవకాశం తిరిగి రాదు. అందుకే మనం టైం దొరికేనప్పుడే ఎంజాయ్ చేయాలి అని చిరు చెప్పాడు. ఇంత మంచి కథలో మనం మళ్ళి నటించడము మళ్ళి కుదరదు. నన్ను నాన్న హత్తుకోనప్పుడు నేను చాల ఎమోషనల్ అయ్యాను.
ఇక పోతే ఆర్ఆర్ఆర్ తో సక్సెస్ మీద ఉన్న చరణ్ ఇప్పుడు ఆచార్య లో సిద్ద పాత్రలో చాల బాగా నటించాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ 29 న వస్తుంది.