ధనుష్ హాలివుడ్ మూవీ ది గ్రే మ్యాన్ పోస్టర్ విడుదల

ధనుష్ తమిళ హీరో సరి కొత్త సినిమాలు చేసుకొంటు ముందుకు దూసుకుపోతున్నాడు. ఇతను ప్రతి సినిమాలో కొత్త వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఎంచుకోవడానికి ఇష్టపడతాడు. ఎవరు చేయలేని కొత్త పాత్రలో తను నటించి అందరి దృష్టిలో పడ్డాడు.

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ త‌మిళ చిత్రాల‌తోనే కాదు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. కాగా ఆయ‌న రీసెంట్ గా హాలీవుడ్ చిత్రం ది గ్రే మ్యాన్ లో న‌టించారు త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌. మాస్.. పవర్ ఫుల్ లుక్ లో కనిస్తున్నారు. ఓ కారుపై ఉన్న ధనుష్ ముఖంపై బ్ల‌డ్ కనిస్తూ.. డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపిస్తున్నారు.

ధ‌నుష్ గ్రే మ్యాన్ కు సంబంధించి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. “ది గ్రే మ్యాన్” యాక్షన్-థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతోంది. ధ‌నుష్ న‌టించిన గ్రే మ్యాన్ సినిమా షూటింగ్ అమెరికాలో జరిగింది.

అందుకోసం నటుడు ధనుష్ దాదాపు మూడు నెలల పాటు యూఎస్ లోనే ఉండి చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు ర్యాన్ కాస్ట్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్ మరియు జెస్సికా హెన్విక్ నటిస్తున్నారు.

. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ సైట్ 1500 కోట్ల రూపాయలతో డీల్ చేసుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఈ చిత్రం ధ‌నుశ్ కి ఏ మేర విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

అయితే, గ్రేమ్యాన్ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ ను ఇదివ‌ర‌కే విడుద‌ల చేసిన‌ప్ప‌టికీ.. అందులో ధ‌నుష్ క‌నిపించ‌లేదు. దీంతో ధనుష్‌కి సంబంధించిన సన్నివేశాలను విడుదల చేయాలని ఆయన అభిమానులు ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.

Related Articles

Latest Articles