తెలుగు బీస్ట్ కు ఊహించని వసూళ్ళు

సుదీర్ఘ కాలంగా తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్‌ హీరోగా వెలుగొందుతోన్నాడు ఇళయదళపతి విజయ్. కెరీర్ ఆరంభంలోనే విభిన్నమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో ఎంతో పేరును, అభిమానులను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో అన్ని ప్రాంతాల్లోనూ మార్కెట్‌ను పెంచుకుని దూసుకుపోతోన్నాడు.

ఇక, ఈ మధ్య ఫుల్ ఫామ్‌లో ఉన్న విజయ్.. గత ఏడాది ‘మాస్టర్’ అనే మూవీతో మరో సక్సెస్‌ను చూశాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ‘బీస్ట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఏ రేంజ్‌లో వచ్చాయి అనేది చూద్దాం పదండి.

‘బీస్ట్’ మోడ్‌లో వచ్చిన విజయ్  :

ఇళయదళపతి విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన చిత్రమే ‘బీస్ట్’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందించాడు. ఇందులో సెల్వ రాఘవన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీలో విజయ్ ‘వీర రాఘవన్’ పాత్రను పోషించాడు.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్ :   

దక్షిణాది మొత్తంలో విజయ్‌కు మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు ‘బీస్ట్’ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుంది. అందుకు అనుగుణంగానే తెలుగులో ఇది రూ. 10 కోట్ల వ్యాపారం జరుపుకుంది.

భారీ అంచనాలతో ‘బీస్ట్’ మూవీ ఫిబ్రవరి 13వ తేదీనే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఓవరాల్‌గా ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో మ్యాట్నీలు అంతంతగానే సాగాయి. అయితే, సాయంత్రం నుంచి మళ్లీ పుంజుకుంది. దీంతో ఈ మూవీకి ఓపెనింగ్ కలెక్షన్లు బాగానే వస్తాయని అందరూ అంచనా వేసేశారు.

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో  :

విజయ్ నటించిన బీస్ట్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 80 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 61 లక్షలు, ఈస్ట్‌లో రూ. 31 లక్షలు, వెస్ట్‌లో రూ. 25 లక్షలు, గుంటూరులో రూ. 34 లక్షలు, కృష్ణాలో రూ. 33 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో కలిపి.. మొదటి రోజు రూ. 4.81 కోట్లు షేర్, రూ. 8.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత వస్తే   :

విజయ్ హీరోగా నెల్సన్ తెరకెక్కించిన ‘బీస్ట్’ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మొదటి రోజే రూ. 4.81 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 5.69 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

విజయ్ కెరీర్‌లో రెండో స్థానం  :

ఇళయదళపతి విజయ్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అతడి చిత్రాలు ఇక్కడ కూడా వస్తుంటాయి. ఇక, ఈ స్టార్ హీరో నటించిన ‘మాస్టర్‌’కు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ. 6.01 కోట్లు వసూలు అయ్యాయి. అయితే, ‘బీస్ట్’ ఆ రికార్డును చేరుకోలేకపోయింది. కానీ, అతడి కెరీర్‌లోనే రెండో అత్యధిక ఓపెనింగ్స్‌ను అందుకుని సత్తా చాటుకుంది.

Related Articles

Latest Articles