టాలీవుడ్ లో మరో వారసుడు.. రవి తేజ కొడుకు ఎంట్రీ !

టాలీవుడ్ హీరో రవి తేజ ఎన్నో సినిమాలలో నటించారు. సినిమాల వలనే అతనికి గుర్తింపు దకింది.

రవి తేజ కొడుకు  టాలీవుడ్ లో కి ఎంట్రీ 

టాలీవుడ్ కి మరో వారసుడు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే బడా హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరి కుటుంబాల నుండి వారసులు తెరమీదకి వచ్చేయగా.

 టాలీవుడ్ కి మరో వారసుడు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే బడా హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరి కుటుంబాల నుండి వారసులు తెరమీదకి వచ్చేయగా.. ఇప్పుడు మాస్ రాజా రవితేజ కుమారుడు కూడా హీరోలగా వెండితెర మీదకి దూసుకొచ్చేస్తున్నాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్‌ హీరోగా ఎదిగిన రవితేజకి మహాధన్ అనే కొడుకున్నాడని.. అతను పెరిగి పెద్దవాడయ్యాడని చాలా మందికి తెలియదు.

సినిమా ప్రపంచంలో హీరోల కొడుకుల ఎంట్రీ సినిమాలకు క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా నిర్మాతలు దర్శకులు వారిని పరిచయం చేసేందుకు పోటీ పడుతుంటారు. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ మాస్ మహారాజా రవితేజ తనయుడు మహాధన్ పైనే ఉంది. అతను త్వరలోనే హీరోగా ఆరంగ్రేటం చేయబోతున్నట్లుగా టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది.

రవితేజ కొడుకుకు మొదటి నుంచి కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని తెలుస్తోంది. ఇక అతని చదువు పూర్తయిన తర్వాతనే సినిమాల్లోకి తీసుకురావాలి అని మాస్ మహారాజా రవితేజ కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఇటీవల అతను యాక్టింగ్ కోర్సు పూర్తి చేసుకోవడంతో ఒక దర్శకుడు కూడా మంచి కథతో సంప్రదించినట్లు తెలుస్తోంది.

మహాధన్ ఇప్పటికే ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో రవితేజ చిన్నప్పటి రోల్‌లో కనిపించాడు. అప్పటి నుండే మహాధన్ ఎంట్రీపై రకరకాల ప్రచారాలు జరుగుతుండగా.. చదువు పూర్తయ్యాక సినిమాలలోకి వస్తాడని రవితేజ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. కాగా, ఇప్పుడు ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ తో మహాధన్ డెబ్యూకి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. మహాధన్‌ కోసం ఇప్పటికే రవితేజను సంప్రదించగా ఆయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది.

రాజా ది గ్రేట్‌ సినిమాతో రవితేజకు హిట్‌ ఇచ్చిన అనిల్‌ రావిపూడే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉంది. మరో వైపు దర్శకుడు హరీష్ శంకర్ కూడా మహాధన్ డెబ్యూకి ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇందుకోసం ఇప్పటికే రవితేజతో కథా చర్చలు కూడా జరిపిన హరీష్ తో అయినా మహాధన్ లాంచింగ్ ఉండే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది.

Related Articles

Latest Articles