ఒక అభిమాని వెడ్డింగ్ కార్డు లో KGF సినిమాలోని యష్ డైలాగ్

ఇప్పుడు ఎక్కడ చూసేన కేగీఫ్ ప్రబంజనం నడుస్తోంది. ఎందుకంటే అంత పిచ్చిగా సినిమా తీసిన ప్రశాంత్ నీల్ కు నిజముగా సెల్యూట్ చేయవచ్చు. ఎందుకంటే ఇంత  elevations తో సినిమా తీయడము అంత ఈజీ అయిన పని కాదు.

ఈ నెల 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. సినిమాలో యశ్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో యశ్ పలికిన ఓ డైలాగ్ ఏకంగా ఓ జంట వెడ్డింగ్ కార్డుపై ముద్రించారంటే మూవీ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

విషయానికి వస్తే కర్ణాటకలోని బెల్గావికి చెందిన చంద్రశేఖర్-శ్వేత వివాహం మే 13న జరగనుంది. వరుడు చంద్రశేఖర్ తమ వెడ్డింగ్ కార్డును ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వెడ్డింగ్ కార్డుపై కేజీఎఫ్ 2 సినిమా డైలాగ్ ఉండటంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మ్యారేజ్, మ్యారేజ్, మ్యారేజ్.. ఐ డోంట్ లైకిట్.. ఐ అవాయిడ్, బట్ మై రిలేటివ్స్ లైక్ మ్యారేజ్.. ఐ కాంట్ అవాయిడ్..’ అనే డైలాగ్‌ను పెళ్లి కార్డుపై ముద్రించారు.

కేజీఎఫ్ 2 సినిమాలోని ‘వయలెన్స్, వయలెన్స్, వయలెన్స్.. ఐ డోంట్ లైకిట్. ఐ అవాయిడ్. బట్ వయలెన్స్ లైక్ మి. ఐ కాంట్ అవాయిడ్.’ అంటూ యశ్ పలికిన డైలాగ్‌లో వయలెన్స్‌కు బదులు మ్యారేజ్‌ని చేర్చి పెళ్లి కార్డుపై ముద్రించారు.

ఈ వెడ్డింగ్ కార్డుపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు అ పెళ్లి కొడుకు పై అది కొంచెం వైరల్ అయ్యింది. ఆ వరుడిని కేజీఎఫ్ 3 సినిమాలో తీసుకోవాలంటూ ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేసాడు ఒక సగటు అభిమాని.

ఇంకో అభిమాని అయితే ఏకముగా ఈ సినిమాలో అ పెళ్లి కొడుకునే తీసుకోవాలని కామెంట్ చేసాడు. ఎందుకంటే అతను యష్ అభిమాని అయి ఉంటాడని కొంత మంది బావిస్తునారు. అందుకే వెడ్డింగ్ కార్డు పై యష్ డైలాగ్ ప్రింట్ చేయించాడని అన్నారు.

‘నాటీ వరల్డ్’ అనే ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వెడ్డింగ్ కార్డుకు ఇప్పటివరకూ 1 లక్ష పైచిలుకు వ్యూస్ వచ్చాయి.

ఇవే కాకుండా ఇంకా చదవండి 

  1. మాట మార్చిన చిరంజీవి ఆచార్య కు గెస్ట్ గా పవన్ కళ్యాణ్
  2. మా నాన్న నాకు గర్వ కారణమము అని అంటున్న రామ్ చరణ్
  3. ప్రబాస్ అభిమానులకు పండగే, సలార్ కొత్త లుక్ వైరల్

Related Articles

Latest Articles