ఒకే సారి 160 బాషలలో విడుదల కానున్న అవతార్ 2 మూవీ

అవతార్ సినిమా తెలియని వారు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. ఈ సినిమా వరల్డ్ లో అంత ఫేమస్ అయిన కామెరాన్ సినిమా. అందరికీ గుర్తుండిపోయే సినిమా. హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ సృష్టించిన  ఓ అద్భుతం ‘అవతార్‌’.

ఈ సినిమా చూసిన వాళ్లు ఎవరైనా సరే..అందులోని వింతల్ని, కొత్త ప్రపంచాల్ని చూసి  మరిచిపోలేరు.  2009లో వచ్చిన ఈ సినిమా హైలెవెల్‌ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను మంత్రం ముద్గుల్ని చేసింది. ఒక కొత్త ఊహా లోకంలో విహరించేలా చేసింది. ఇలాంటి లోకం కూడా ఒకటి ఉంటుందా అనే విధంగా జేమ్స్ కామెరాన్.. విజువల్స్‌తో వండర్ చేశాడు.

ఇప్పటికీ అవతార్ బాక్సాఫీస్ రికార్డ్ చెక్కు చెదరకుండా ఉందంటే అది ఏ స్థాయి విజయమో అంచనా వేయొచ్చు. చాలాచోట్ల అవతార్ సృష్టించిన రికార్డుల్ని అవెంజర్స్- ఎండ్ గేమ్ కూడా బ్రేక్ చేయలేకపోయింది. అవతార్ సిరీస్ నుంచి వరుసగా సీక్వెల్స్ విడుదల కానున్నాయి. వాటి డేట్స్ కూడా కామెరూన్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అవతార్ 2 సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా అవతార్ 2 సినిమా డిసెంబర్ 16న రిలీజ్ కానుంది.  ఏకంగా 160 భాషల్లో ఈ సినిమా విడుదల అవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రపంచ సినీ చరిత్రలోనే ఇదే రికార్డ్ కానుంది. అలాగే ఈరోజు (బుధవారం) మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్ ని సినిమా కాన్ లో ప్రీమియర్ ప్రదర్శితం చేయనున్నారట.

అలాగే హాలీవుడ్ సినిమా డాక్టర్ స్ట్రేంజ్ మ్యాడ్ నెస్ ఆఫ్ మల్టీ వర్స్ థియేటర్స్ లో కూడా రిలీజ్ చేయనున్నారట. దీంతో ఆడియెన్స్ ఇప్పుడు ఈ క్రేజీ గ్లిమ్ప్స్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సినిమా కాన్ హాజరైన వారికి చూపించే అవతార్ 2 ఫుటేజ్ నిడివి ఎంత అన్నది స్పష్టంగా తెలియనప్పటికీ ఈ ఈవెంట్ బ్రాడ్ పిట్ బుల్లెట్ ట్రైన్ .. స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్ ల ప్రారంభ 15 నిమిషాల విజువల్ లేదా అంతకంటే ఎక్కువ నిమిషాల పాటు నిడివితో వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈవెంట్ తర్వాత ఫుటేజీకి సంబంధించిన వివరణలు కాసేపట్లో వెల్లడి కానుందట. అది ట్రైలర్ లేదా 15 నుండి 20 నిమిషాల ఫుటేజ్ అనేది నేను ఇంకా గుర్తించలేకపోయాను. బుధవారం తెలుస్తుంది.

Related Articles

Latest Articles