జే సి ప్రభాకర్ రెడ్డి తో భేటి అయిన బిజెపి నేత సునీల్ దేవ్ ధర్

జే సి ప్రభాకర్ రెడ్డి తో భేటి అయిన బిజెపి నేత సునీల్ దేవ్ ధర్: మన ఆంధ్రలో జే సి  దివాకర్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు.అయన మాటలు అంత చమత్కారము గా ఉంటాయి అయన ఎది మాట్లాడిన అది న్యూస్ గా మారిపోతుంది. అలాగే అయన తమ్ముడు జే సి ప్రభాకర్  కూడా మంచి చమత్కారి.

ఈ సందర్భములో ఆయనను కలవడానికి వచ్చిన ఒక బిజెపి నేత ఇది ఇప్పుడు అనంతపురములో ఒక వైరల్ న్యూస్ గా మారిపోయింది. ఎందుకంటే అయన రాజకీయము పరముగా కలిసదో లేదా పర్సనల్ విషయాల గురించో తెలియదు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్‌పర్స్ జేసీ ప్రభాకర్ రెడ్డితో బీజేపీ నేత సునీల్ దేవ్‌ధర్ భేటీ అయ్యారు. జేసీ నివాసానికి వెళ్లీ మరీ కలిశారు. ఇద్దరు నేతల భేటీతో ఆసక్తికర చర్చ. మర్యాదపూర్వకంగా కలిశారంటున్న జేసీ వర్గీయులు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్‌ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవధర్ సమావేశమయ్యారు. తాడిపత్రిలోని జేసీ నివాసంలో భేటీ అయ్యారు. ఇద్దరు కలిసి తేనేటి విందు లో పాల్గొన్నారు.

అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలతో పాటూ సమస్యలపై చర్చించుకున్నారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని.. మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలుస్తోంది.

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కొందరు స్పందిస్తున్నారు. వైఎస్సార్‌సీపీపై పగతో రగిలి పోతున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానం పలికిన ఆ పార్టీ నేత సునీల్ దేవధర్.. ఇప్పుడు బస్ యాత్ర చెయ్యాలి అనుకుంటున్నా..

ఎన్నికల ముందు చేరేది లేనిది చెప్తామని భోజనం పెట్టి వెనక్కు పంపిన జే సి ప్రభాకేర్ రెడ్డి  అని చెప్పాలి కథ చెప్పాలి అంటూ ట్రోల్ చేశారు. కొందరు పార్టీ మారుతున్నారా అంటూ ప్రశ్నించారు. జేసీ అనుచరులు మాత్రం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని.. పార్టీ మారే ఉద్దేశం లేదంటున్నారు.

ఇవే కాక ఇంకా చదవండి

  1. కోర్టూ బాష మార్చనున్న మోదీ దానికి సహకరించిన రమణ
  2. C M జగన్ ఆరోగ్యశాఖా పై సమావేశాలు !

Related Articles

Latest Articles