100 కోట్ల స్థలం పై వివాదం వెంకటేష్ పై కేసు నమోదు

బంజారాహిల్స్‌లో విలువైన రూ.100 కోట్ల స్థలంపై వివాదం నెలకొన్న విధానలో ఎపి ఎంపి టీజీ వెంకటేశ్‌, ఆయన సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్‌పై కేసు నమోదయింది.

బంజారాహిల్స్‌:

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 10 లో ఏపీ జెమ్స్‌ అండ్‌ జువెలర్స్‌ పార్క్‌కు 2005 లో అప్పటి ప్రభుత్వం దాదాపు రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో సంస్థ నిర్మాణాలు చేపట్టగా ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న మరో అర ఎకరానికి పైగా స్థలం ఖాళీగా ఉంది.

ఈ జాగా తమదేనంటూ … కొందరు టీజీ వెంకటేష్‌ సోదరుడి కుమారుడు, సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు కొద్దిరోజుల కిందట డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేశారు.

దీంతో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆదివారం ఉదయం దాదాపు 10 వాహనాల్లో కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన 90 మంది మారణాయుధాలతో అక్కడకు చేరుకొని కాపలాదారులపై దాడికి పాల్పడ్డారు.

విషయం తెలుసుకొన్న బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకోగా, వారు పోలీసులను గమనించి కొందరు వాహనాల్లో పరారయ్యారు. 63 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారందరినీ కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు తీసుకొని వెళ్లారు.

స్థలం ఖరీదు దాదాపు 100 కోట్ల  :

దీనిపై బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో ఎపి ఎంపి టీజీ వెంకటేశ్‌, టీజీ విశ్వప్రసాద్‌, వీవీఎస్‌ శర్మ, తదితర 15 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామన్నారు. స్థలం విలువ దాదాపు రూ.100 కోట్లు ఉండవచ్చని తెలిపారు.

గతంలోనూ ఈ స్థలంపై పలు కేసులు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. స్థలానికి చెందిన చీఫ్‌ సెక్యూరిటీ అధికారి నగేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు … పట్టుబడినవారిపై హత్యాయత్నం కేసుతోపాటు అక్రమ ప్రవేశం, సమూహంగా వచ్చి దాడి చేయడం, తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.

విశ్వప్రసాద్‌ ఆదివారం 80 మంది రౌడీలను మారణాయుధాలతో ఈ ప్రభుత్వ స్థలంలోకి పంపించాడు. వారు ఈ స్థలంలోకి ప్రవేశించి అక్కడున్న సెక్యురిటీ గార్డుల్ని కొట్టి బయటకు తరిమారు. రౌడీమూకల దౌర్జన్యంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

విషయం తెలుసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకుని 62 మంది రౌడీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన రౌడీలు పరారయ్యారు. ఈ సంఘటనపై బంజారాహిల్స్‌ పోలీసులు ఎంపీ టీజీ వెంకటేశ్, విశ్వప్రసాద్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక తాజాగా వంద కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించటం కోసం కర్నూలు జిల్లా ఆదోని కి చెందిన కొంతమంది రాజకీయ నాయకులను ఒక గ్రూపుగా కలుపుకొని, రాత్రికి రాత్రే స్థలాన్ని కబ్జా చేయడానికి రంగంలోకి దిగారు.

అందుకోసం రాయలసీమ బ్యాచ్ ను మారణాయుధాలతో రంగంలోకి దించిన భూ మాఫియా స్థలాన్ని అ తమ అధీనంలోకి తెచ్చుకోవడం కోసం విధ్వంసం సృష్టించారు. కాపలా దారులపై దాడి చేసి, అక్కడ ఉన్న ఏపీ జెమ్స్ చేసిన నిర్మాణాలను కూల్చివేశారు.

ఇక కంటైనర్లను స్థలంలోకి దించి తమ ఆధీనంలోకి స్థలాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఒక గంట వ్యవధిలోనే వీరంగం సృష్టించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు.

ఇవి కూడా చదవండి  : 

Related Articles

Latest Articles