పరువు హత్యలు అనేవి మత సమాజాల్లో వ్యక్తిగత కుటుంబ పరువు, గౌవరవం, మర్యాద వంటి పేర్లతో జరిగే హత్యలు. ఈ హత్యలు ఎక్కువగా ఇస్లామిక్ దేశాలలో జరుగుతుంటాయి. హిందూ దేశాలైన ఇండియా, నేపాల్ లోనూ, కొన్ని క్రైస్తవ దేశాలలోనూ కూడా ఈ హత్యలు కనిపిస్తుంటాయి. ప్రేమ, పెళ్ళికి ముందు సెక్స్, మతాంతర వివాహం, జాత్యాంతర వివాహం లాంటివి చేసుకున్న వారిని పరువు పేరుతో హత్య చెయ్యడం జరుగుతోంది.
పరువు హత్యలు ఎక్కువగా తెలంగాణాలో జరుగుతున్న విషయము తెలిసిందే. ఇది వరువగా 4 వ సారి పరువు హత్య కేసు ఇందులో ప్రేమ జంట లను హత్య చేయడం, ఇది కూడా వారి తల్లి తండ్రులు కారణము కావడం అది అబ్బాయి అయిన కావచ్చు లేదా అమ్మాయి అయిన కావచ్చు వాళ్ళ లో ఎవరో ఒకరిని హత్య చేసి వాళ్ళు పాపాలు ముతా కట్టు కొంటున్నారు.
హైదరాబాద్ బేగం బజార్ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య తర్వాత కర్నాటక పారిపోయిన ఐదుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న నీరజ్ పై కక్ష కట్టిన యువతి కుటుంబీకులు నిన్న బేగం బజార్‌లో అత్యంత పాశవికంగా హత్య చేశారు. అటు నీరజ్ హత్యకు నిరసనగా ఇవాళ బేగం బజార్ బంద్‌కు వ్యాపారులు పిలుపునిచ్చారు.
బేగంబజార్‌లోని షా ఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చీ మార్కెట్‌లో ఈ హత్య జరిగింది. రెండు బైక్‌లపై వచ్చిన ఐదుగురు అందరూ చూస్తుండగానే నీరజ్ పన్వార్‌పై కత్తులతో విరుచుకుపడ్డారు. అతన్ని 20 కత్తిపోట్లు పొడిచారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నీరజ్ పన్వర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. నీరజ్ ఏడాది క్రితం, సంజన అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.ఆరు నెలల క్రితం వీరికి ఒక కుమారుడు జన్మించాడు.