కరోనా ఫోర్త్ వేవ్ బీ అలెర్ట్ అని చెప్పుతున్న ప్రధాని మోడీ !

కరోనా రాను రాను పెరుగుతూనే ఉంది. ఇప్పటి దాక తాగానే లేదు, అయితే మొదటి నుండి ఎప్పటి దాక వరుసుగా కేసు లు పెరుగుతున్నాయికానీ తగ్గలేదు. ఫోర్త్ వేవ్ రావడం వలన మనషుల్లో ఇంకా భయనదోలన ఎక్కువగా ఉంది. ఫోర్త్ వేవ్ వివిధ ప్రాంతాలలో రావడం జరిగింది. అలాగే మరణాలు కూడా ఎక్కువ గ ఉన్నాయి. ఎక్కువగా ఢిల్లీ, హర్యానా వంటి ప్రేదేశాలలో ఎక్కువగా ఉంది. దిని వలన మనషు లకు తొందరగా సోకే అవకాశం ఉంది అని వైదులు తెలియచేస్తున్నారు.

ప్రధాని మోడీ కీలక అంశాలు :

గత రెండు వారాలుగా దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వర్చువల్‌గా సమావేవమయ్యారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్ సబ్-వేరియంట్‌లతో ముప్పు పొంచి ఉందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గత రెండు వారాలుగా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ వ్యూహంతో తొలి దశలోనే వైరస్‌ను నియంత్రించాలని పేర్కొన్నారు. ప్రికాషనరీ డోస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహ అర్హులైన ప్రతి ఒక్కళ్లూ కరోనా నుంచి తమను తాము రక్షించుకోడానికి తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు. సుదీర్ఘకాలం తర్వాత స్కూల్స్ తెరుచుకోవడం వల్ల కేసులు సంఖ్య పెరుగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

కానీ, 6-12 ఏళ్లలోపు చిన్నారకు కొవాగ్జిన్ టీకాను ప్రారంభించనుండటం శుభపరిణామమని మోదీ చెప్పారు. దేశంలో ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేరువయ్యింది… దేశంలోని 96 శాతం మంది తొలిడోస్ తీసుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. అలాగే 85 శాతం మంది రెండు డోస్‌లు తీసుకున్నారని వివరించారు.

అంతేకాదు, కరోనా మహమ్మారితో పోరాటం ముగియలేదని, ఒమిక్రాన్, దాని ఉప-వేరియంట్లు ఐరోపాలో విజృంభిస్తున్నాయని తెలిపారు. కోవిడ్ సంక్షోభాన్ని సమర్ధంగా నిర్వహించినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే పలు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని, మనం అప్రమత్తంగా ఉండాలన్నారు.
కోవిడ్ సవాల్‌ను ఇంకా అధిగమించలేదని స్పష్టమైందని ప్రధాని పేర్కొన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రోత్సహించాల్సి ఉందని సూచించారు. మెడికల్ కాలేజీలు, జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యలు, మానవ వనరులను పెంచాలని సీఎంలకు వివరించారు.
భారతదేశంలోని వయోజన జనాభాలో 86 శాతానికి పైగా ఇప్పుడు కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్‌కు వ్యతిరేకంగా పూర్తిగా టీకాలు వేయబడ్డారని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
మంగళవారం నాటికి దేశంలో వ్యాక్సిన్ మోతాదుల పంపిణీ సంఖ్య 188 కోట్లు దాటింది.
మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు 19 లక్షలకు పైగా (19,67,717) వ్యాక్సిన్ డోస్‌లు వేయబడ్డాయి.మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు 18-59 సంవత్సరాల వయస్సు గల వారికి కోవిడ్ వ్యాక్సిన్ ముందు జాగ్రత్త మోతాదులు 46,044 అందించారు.
దీంతో ఈ వయస్సు సమూహంలో మొత్తం ముందు జాగ్రత్త మోతాదుల సంఖ్య 5,15,290కి చేరుకుంది.డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) మంగళవారం భారత్ బయోటెక్ త‌యారు చేసిన కోవాక్సిన్‌కు 6-12 సంవత్సరాల వయస్సు వారికి మరియు కార్బెవాక్స్ 5-12 సంవత్సరాల వయస్సు గల వారికి అత్యవసర వినియోగ కింద ఇవ్వ‌డానికి అనుమ‌తి మంజూరు చేసింది. జైడస్ కాడిలా రెండు డోసుల‌ కోవిడ్-19 వ్యాక్సిన్ ను కూడా 12 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వ‌య‌స్సు  జనాభా కోసం ఆమోదించబడింది.

Related Articles

Latest Articles