బీసీసీఐ సరి కొత్త నిబంధన – నిరాశ లో క్రికెట్ అభిమానులు

బ్యాట్స్‌మన్‌ బౌండరీ కొట్టిన సిక్స్ కొట్టిన  బౌలర్‌ వికెట్‌ తీసినా లేదా మ్యాచ్ గెలిచేలా చేసిన అభిమానులు కేకలు, చప్పట్లు కొట్టడం తమ ఇష్టమైన క్రికెట్ కోసం అరుస్తూ ఉంటారు. ఇవ్వని స్టేడియం లో సహజం గా జరిగేవి.

వారి చేతుల్లో ఉండే జెండాలను అటూ ఇటూ ఊపుతూ తమ అభిమానం తెలుపు కొంటారు. ఇక  మీదట మీదట అల చేయడానికి వీలు లేదు, దాంతో పాటు చేతి లో కర్రలు  జెండాలు ఉండకూడదు. అని బీసీసీఐ సరి కొత్త నిబందన వినడానికి విచిత్రము గా ఉన్న నమ్మక తప్పదు.

ఐపీఎల్‌ మ్యాచ్‌ చూడడానికి వచ్చే ప్రేక్షకులు ఇకపై జెండాలు తీసుకురావడానికి వీలేదని.. ఒకవేళ తెచ్చినా పలు ఆంక్షలు అమల్లో ఉంటాయని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది  జెండాలకు పెట్టిన కర్రలతో స్టేడియంలోని వారిపై దాడి చేసేందుకు ఆస్కారం ఉంటుందని, అలాగే మైదానం లో కి విసిరే ప్రమాదం ఉందని బీసీసీఐ ఒక  ప్రకటన లో తెలిపింది.

సహజంగా కరోన కి ముందు మాములు పరిస్థితులే ఉండడంతో జట్టు యాజమాన్యాలే ప్లాస్టిక్ జెండాలను ఇచ్చేవారు. ఇప్పుడు బీసీసీఐ కరోన నిబందనల కారణంగా నేరుగా మ్యాచ్ లను నిర్వహిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

బీసీసీఐ, ముంబై పోలీసుల నిర్ణయంతో అభిమానులు చాల నిరాశ లో ఉన్నారు. విరాట్ కోహ్లీకి పెద్ద అభిమాని అయిన చిరాగ్ ఖిలారే అనే వ్యక్తిని బుధవారం పోలీసులు స్టేడియం లోపలికి వెళ్లకుండా అడ్డుకొన్న విషయం తెల్సిందే. కర్ర జెండాను బయట పడేసాకే లోపలికి అనుమతించారు.  కావున బీసీసీఐ తెచ్చిన ఈ సరి కొత్త నిభందనలు అభిమానులను ఇబ్బందుల్లో పడేసాయి.

Related Articles

Latest Articles