పంజాబ్ మీద గెలవడానికి గుజరాత్ టైటాన్ కు చివరలో 19 పరుగులు చేయాల్సి ఉంది. మొదట నాలుగు బంతులలో ఏడూ పరుగులు వచ్చాయి. అట ముగిసే సమయానికి 2 బంతుల్లో 2 సిక్సర్లు కొట్టాల్సి వచ్చింది. తీవ్ర ఒత్తిడి మధ్య ఇలాంటి స్థితిలో రెండు వరుస సిక్సర్లు కొట్టడం బాట్స్మన్ వల్ల కూడా కాదు. అయితే రాహుల్ తెవాటియా దాని నిరూపించాడు.
ఇదే ఐపీఎల్లో రెండు ఏళ్ల క్రితం పంజాబ్‌పై రాజస్తాన్ తరఫున ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు బాదిన మ్యాచ్‌ను గుర్తుకు తెస్తూ ఈసారి చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలచి గుజరాత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. దీంతో శుక్రవారం జరిగిన పోరులో టైటాన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఈ లీగ్‌లో వరుసగా మూడో విజయం అందుకొంది.
ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ (27 బంతుల్లో 64; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు.అ తర్వాత గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (59 బంతుల్లో 96; 11 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు.
రషీద్ మూడు వికెట్లు తీసాడు:
మయాంక్ అగర్వాల్ (5), బెయిర్‌స్టో (8) తక్కువ స్కోరుకే అవుటైనా లివింగ్‌స్టోన్ మెరుపులతో పంజాబ్ జట్టు ఇన్నింగ్స్‌కు మంచి జోరు వచ్చింది. రషీద్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన అతను… నల్కండే ఓవర్లో సిక్స్, 2 ఫోర్లతో చెలరేగాడు. తెవాటియా ఓవర్లో పంజాబ్ 24 పరుగులు రాబట్టింది.
ఈ ఓవర్స్ లో రెండు సిక్సర్లు కొట్టాడు. లివింగ్‌స్టోన్ ఒక ఫోర్ మరియు ఒక సిక్స్ కొట్టాలి. ఆ తర్వాత వరుస బంతుల్లో జితేశ్, ఒడెన్ స్మిత్ (0)లను నల్కండే పెవిలియన్ పంపించగా, షమీ ఓవర్లో షారుఖ్ (15) కొట్టిన రెండు వరుస సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి. అయితే స్కోరు 200 చేస్తారు అను కొన్న సమయం లో పంజాబ్ 9 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కు పడిపోయింది.
గిల్ శ్రమ వృధా సెంచరీ మిస్ :
పవర్‌ప్లేలో గుజరాత్ స్కోరు 53 పరుగులకు చేరింది. మరోవైపు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న సుదర్శన్ కూడా కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 68 బంతుల్లోనే 101 పరుగులు జోడించారు.
ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 27; 5 ఫోర్లు) కూడా ధాటిగా ఆడుతూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. దురదృష్టవశాత్తూ గిల్ సెంచరీ చేజార్చుకోగా… చివలో పాండ్య రన్ ఔట్ కావడం తో కొంత ఆస వచ్చింది. అయితే రాహుల్ తెవాటియా టైటాన్స్‌ను గెలిచేలా చేసాడు.