వడ దెబ్బ కొట్టినపుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలు ఏమిటి !

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మామూలుగా లేవు. ఆ ఎర్రటి ఎండలో గంట తిరిగినా చాలు వడదెబ్బ కొట్టేలా ఉంది. కనుక ఎండల్లో తిరగడం వీలైనంతగా తగ్గిస్తే మంచిది. లేదా వడదెబ్బ తగలకుండా చూసుకోవడం మరీ ఉత్తమం. ఎండాకాలంలో ఏది పడితే అది తినకుండా  నీటి శాతం ఎక్కువగా ఉన్నా పదార్థాలు తినాలి. ఎండల్లో తిరిగే వాళ్లు రోజుకో పుచ్చకాయ తినేసినా మంచిదే. స్ట్రాబెర్రీ జ్యూస్ కూడా తాగితే మంచిదే అన్ని చోట్ల ఈ పండు దొరకదు కాబట్టి పుచ్చకాయ మేలు.

కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బయటకు వెళ్తే కరోనా సోకుతుందో లేదో తెలీదుగానీ వడదెబ్బ తగలడం మాత్రం  ఖచ్చితం ఎండలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా తిరిగితే శరీరం అదుపు తప్పుతుంది. శరీర ఉష్ణో గ్రతను నియంత్రించే వ్యవస్థ బలహీనపడి వడదెబ్బకు గురవుతారు.

కుండ లోనిచల్లని నీళ్లు తాగుతూ శరీరాన్ని సమతులంగా ఉంచుకోవటం ద్వారా వడదెబ్బ నుంచి బయటపడొచ్చు. చాలామంది బయట తిరిగితేనే వడదెబ్బ తగులుతుందని భావిస్తారు. అయితే, ఇంట్లో కుర్చున్నవారికి కూడా వడదెబ్బ తగులుతుంది.

ఇంట్లో ఎక్కువ వేడి, ఉక్కపోత ఉన్నప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గిపోయి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే.. జ్వరం వస్తుంది. మీ శరీర ఉష్ణోగ్రతలు 104, 106 డిగ్రీల ఫారెన్‌ హీట్‌‌కు పెరిగితే వడదెబ్బకు గురైనట్లు గుర్తించాలి.

వడ దెబ్బ అనగా ఏమిటి ?

ఎండదెబ్బ అంటే పరిసరాల్లో ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని వేడిని నియంత్రించే విధానం (thermoregulation) విఫలమవడం. చాలా వేడియైన వాతావరణంలో, సరియైన మోతాదులో ద్రవపదార్థాలని తీసుకోకుండా తీవ్ర వ్యాయామం లాంటి చురుకైన పనులవలన కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, శరీరం యొక్క ప్రాథమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తాయి. వేడికి సంబంధించిన సమస్యలలో వడదెబ్బ చాలా తీవ్రమైనది.

శరీరంలో వేడిని చల్లబరచడానికి చెమటపట్టే క్రమంలో కొన్నిసార్లు రక్తంలో ద్రవం ఎక్కువగా ఆవిరైపోతుంది. అప్పుడు శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పనిచెయ్యకుండా, చెమట పట్టడం కూడా ఆగిపోయి, శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీలు కూడా దాటవచ్చు. ఆ సమయంలో శరీరం ముట్టుకుంటే కాలుతూ ఉంటుంది. చర్మం పొడిబారుతుంది. నీరు, రక్తం పరిమాణం తగ్గడం వల్ల రక్తపోటు కూడా పడిపోతుంది.

వడ దెబ్బ తగిలిన వెంటనే శరీరంలో కలిగే మార్పులు :

ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల గుండె లయ తప్పుతుంది. శరీరంలోని శక్తినంతా పీల్చేసిన అనుభవం కలుగుతుంది. మెదడు కూడా సమతుల్యత తప్పుతుంది. ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతే మరణాలు సంభవిస్తాయి. వడదెబ్బ వల్ల 40 శాతం మేరకు మరణాలు చోటుచేసుకుంటున్నాయి. వడదెబ్బ వల్ల శరీరంలోని నీటి శాతం లేకపోవడం వలనే చనిపోతున్నారు.

చెమట పట్టడం నిలిచిపోతుంది, నాడి వేగం పెరుగుతుంది శరీరం అదుపుతప్పుతుంది. మెదడు స్వాధీనంలో ఉండకపోవడం వల్ల గందరగోళానికి గురవ్వుతారు. కళ్లు మసకబారుతాయి. వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే కోమాలోకి జారుకుంటారు. పొడి చర్మం ఉండేవారు కూడా త్వరగా వడదెబ్బకు గురవ్వుతారు. శరీరంలోని రక్త కణాలు కుంచించుకుపోవడం వల్ల కిడ్నీలు, లివర్‌‌ దెబ్బతింటాయి. వడదెబ్బ యాక్సిడెంట్ లాంటిది.. అనుకోకుండా సంభవిస్తుంది.

వడదెబ్బ ఎందుకు వస్తుంది :

ఎక్కు వగా ఎండలో తిరగడం వల్ల హృదయ స్పందనలో కలిగే మార్పుల కారణంగా మెదడులోని భాగం సమతుల్యతను కోల్పోతుంది. ఫలితంగా అదుపు చేసే శక్తి లేకపోవటంతో సన్‌ స్ట్రో క్‌ తగిలి ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి. దాదాపు 30 నుండి 40 శాతం మేర వడదెబ్బ మరణాలు చోటుచేసుకుంటాయి. లక్షణాలు శరీరం నుంచి చెమట రావడం నిలిచిపోతుంది. నాడి వేగంగా కొట్టుకుంటుంది. శరీరం, మెదడుస్వాధీనంలో ఉండవు.

సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మిగతా అన్ని జబ్బులను నయం చేసుకోడానికి కొంత వ్యవధి ఉంటుంది. కానీ వడదెబ్బ విషయంలో ప్రాణాపాయం జరగడమన్నది ఒక్కోసారి కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలలో జరిగిపోవచ్చు. చర్మం పొడిబారిపోవడం అన్నది కేవలం చర్మ సంబంధ సమస్య కాదు. శరీరంలో నీటి పరిమాణం పడిపోయిందని చెప్పే ఒక సూచన.వడదెబ్బ నుంచి కాస్త కోలుకున్నామని అనిపించిన వెంటనే మళ్లీ ఎండలోకి వెళ్లొద్దు.

 

సాధారణంగా ఐదేళ్ల లోపు, 60 సంవత్సరాలు పైబడిన వారు త్వరగా ఎండదెబ్బకు గురవుతారు.ఒక్కో సారి ఇది ఆకస్మిక మరణాలకు దారితీస్తుంది. అదే విధంగా గర్భిణీలు,బాలింతలు శరీరంలోని తేమ శాతాన్ని కాపాడుకుంటూ ఉండాలి. క్రీడాకారులు, స్థూలకాయులు,దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నవారు, ఆరు బయట వ్యాయామం.

పోలీసు వంటి వృత్తుల్లో ఉన్న వాళ్లు శరీరం డీ హైడ్రేట్‍ కాకుండా చూసుకోవాలి. మద్యం తీసుకునేవాళ్లు,మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవాళ్లు చాలా కేర్ ల్ గా ఉండాలి.కొన్ని మందులు వాడే వారు. పొడి చర్మం, వేడి చర్మం ఉన్న వాళ్లు, స్వేద రంధ్రాలు తక్కు వగా ఉండే వాళ్లకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కు వగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వీరంతా ఎండకు బయటకు వెళ్లకపోవడమే మంచిది.

 వడదెబ్బ ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది :

60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, చిన్నారులు, క్రీడాకారులు, గర్భిణీలు, బాలింతలపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు, స్థూలకాయులు, మద్యం ఎక్కువగా తాగేవాళ్లు, అతిగా ఔషదాలు తీసుకొనేవారు అందరు జాగ్రత్తగా ఉండాలి. వేసవిలో ఎక్కువ సేపు ఎండలో పనిచేసే కూలీలు, కార్మికులు, ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వడ దెబ్బ కొట్టినపుడు ఎలాంటి ఆహరం తీసుకోవాలి :

ఎండల్లో బయటికి వెళ్లేప్పుడు పొట్ట నిండా బిర్యానీలాంటి ఆయిల్ ఫుడ్ తిని వెళ్లకండి. తేలికపాటి ఆహారం తిని, మజ్జిగ, పళ్ల రసాలు తాగి వెళ్లడం మంచిది. శరీరంలో నీటి సమతుల్యత కాపాడు కోవడం చాలా ముఖ్యం. ప్రతి అరగంటకు నీళ్లు తాగుతూ ఉండాలి. నిరు తాగడం వలన మనకే మంచిది.

రోజుకు ఐదు, ఆరు లీటర్లు నిరు తాగేయాలి. ఓఆర్ఎస్ పౌడర్, కొబ్బరినీళ్లు, గ్లూకోజ్ కూడా రోజులో రెండు మూడు సార్లు తీసుకుంటే మరీ మంచిది. పిల్లలు, వృద్ధులలో వేడిని తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కనుక వేసవిలో వీరికి ప్రత్యేక జాగ్రత్తలు అవసరం.

వడ దెబ్బ తగిలిన వారిని ఎం చేయాలి :
ఎవరైనా వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడలో పడుకోబెట్టి దుస్తులు తీసివేయాలి. రక్తనాళాలు కుంచించుకుపోకుండా కాపాడవచ్చు. అందుబాటులో ఐస్ ముక్కలు ఉంటే వెంటే మెడ పై పెట్టాలి. తలపై చల్లని నీటితో తడిపిన బట్టని పెట్టాలి. ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీటిని కొంచెంకొంచెంగా తాగించాలి. ఇవన్నీ ఒక పక్క చేస్తూనే వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
వడదెబ్బ లక్షణాలు :
  • శరీరంలో నీటి శాతం లోపిస్తుంది. శరీరం అదుపుతప్పుతుంది.
  • నీరసంగా అనిపిస్తుంది. కొందరికి కళ్లు లాగుతాయి. తలనొప్పి వస్తుంది.
  • వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటే వాంతులు, విరేచనాలు ఏర్పడతాయి.
  •  శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. జ్వరం ఏర్పడుతుంది.
  •  దాహం ఎక్కువగా ఉంటుంది. తల తిరగడం, మతి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వడదెబ్బ ప్రభావం ముందుగా శరీరంపై పడుతుంది. అధికంగా ఎండలో తిరగటంతో శరీరం మీది రక్త కణాలు కుంచించుకుపోతాయి. అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, లివర్‌‌ దెబ్బతినడానికి దారి తీస్తుంది. శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటి చిన్నపాటి జాగ్రత్తలతో వడదెబ్బను అధిగమిం చవచ్చు.

వడదెబ్బ తగిలిన రోజంతా విశ్రాంతి తీసుకుంటేనే శరీర వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. ఈ లక్షణాలు కనబడితే వెంటనే వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి తరలించాలి. శరీరాన్ని చల్లటి నీళ్లతో లేదా ఐస్ తో తుడవాలి.వెంటనే డాక్టర్‍ దగ్గరకు తీసుకెళ్లాలి.వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు క్యాప్‍ పెట్టుకోవాలి. తరచూ నీళ్లు తాగుతుండాలి. కళ్లకు కూలింగ్‍ గ్లాసెస్‍ పెట్టుకోవాలి. అలాగే బయటకి వెళ్లేటప్పుడు వాటర్‍ బాటిల్‍ ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి.

వడదెబ్బ తగిలినపుడు ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి :

  • వడదెబ్బ తగిలిన తర్వాత మళ్లీ ఎండలోకి వెళ్లకూడదు. విశ్రాంతి తీసుకోవాలి.
  • వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీరాన్ని ఐస్ లేదా నీటితో తుడవాలి. వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి. వడదెబ్బ
  • తగలకుండా ఉండాలంటే ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు క్యాప్‍ పెట్టుకోవాలి. గొడుగు తీసుకెళ్లాలి. రోజుకు ఐదారు లీటర్లకు
  • తగ్గకుండా నీరు తాగాలి.
  • సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి.
  •  ఉప్పు కలిపిన ద్రవాలు తాగాలి.
  •  వదులైన కాటన్ దుస్తులు ధరించాలి.
  •  నూనె పదార్థాల వాడకం తగ్గించాలి.
  •  వేసవిలో శీతల పానీయాలు అంత మంచివి కాదు. వాటికి బదులు కొబ్బరి బోండాం, మజ్జిగ తాగండి.
  • వడదెబ్బ వల్ల కళ్లు పొడిబారే అవకాశం ఉంది. కాబట్టి బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా సన్‌గ్లాసెస్ పెట్టుకోవాలి.
  • బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా నీళ్ల బాటిల్ లేదా ఓఆర్ఎస్ వెంట తీసుకెళ్లండి.
  • మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో తిరగకూడదు.

ఈ చిట్కాలు పాటించడం వలన వడదెబ్బ నుండి జాగ్రతగా ఉండవచు :

  • ఈ వేసవిలో కీరదోస ముక్కల్ని ఎక్కువగా తినడండి. దీనివల్ల శరీరానికి నీటితోపాటు పోషకాలు కూడా అందుతాయి. మలబద్దక సమస్య కూడా తగ్గుతుంది.
  • శరీరంలో నీటి శాతాన్ని పెంచే పుచ్చకాయ, కొబ్బరినీళ్లు తాగాలి.
  •  వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఉల్లిపాయను మెత్తగా నూరి శరీరానికి రాయాలి.
  •  జీలకర్ర దోరగా వేయించి పొడిచేయండి. అర స్పూన్ పొడిని ఒక గ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగితే శరీరానికి  చాల  ఎనర్జీ వస్తుంది.
  • ఈ కాలంలో సలాడ్స్, తాజా కాయగూరలు, ప్రూట్ జ్యూస్‌లు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నూనె పదార్థాల వాడకం తగ్గించాలి.
  • సన్‌ స్ట్రో క్‌ నుంచి రక్షణ పొందేందుకు చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలి.
  • ఎండలో బయటికి వెళ్లేవారు టోపీలు,స్కార్ఫ్‌ లు వాడితే మంచిది.
  • ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుండి ఐదు గంటల వరకు ఎండలోతిరగకపోవటం ఉత్తమం.
  • ప్రతి అర్ధగంటకు మూడు వందల మిల్లీలీ టర్ల చొప్పున రోజుకు ఐదారు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి.ఓ.ఆర్‌‌.ఎస్‌ . నీళ్ళు, కొబ్బరికాయ,గ్లూ కోజ్‌ నీరు తీసుకోవటం మంచిది.
  • విద్యార్థు లు పరీక్షల సమయం కావటంతో ఎండ నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. సాయంత్రం సమయంలో ఆడుకోవటం మంచిది.
  • శరీరం లవణాలను కోల్పోకుండా ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.ఉప్పు వేసిన ద్రవాలు ఇవ్వాలి. చెమటను గ్రహించే, చల్లగా ఉండే వదులైన కాటన్ దుస్తులు ధరించాలి
  • వేసవిలో శీతల పానీయాలు అంత మంచిది కాదు. వాటికి బదులు కొబ్బరి బోండాం, మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిది. దీని వల్ల శరీరంలోని లవణాలు కోల్పోకుండా జాగ్రత్త పడొచ్చు.

చిన్న మనవి :లాక్‌డౌన్ వల్ల ఎంతోమంది వలస కూలీలు ఎండల్లో తమ పిల్లలతో నడుస్తూ తమ స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఈ ఎండల్లో వారు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. మీకు వారెవరైనా కనిపిస్తే మజ్జిగ, నిమ్మరసం లేదా మంచి నీళ్లు ఇచ్చి ఆదుకోండి. వీలైతే ఆశ్రయం కల్పించండి.

ఇవి కూడా చదవండి :

  1. రోజ్ వాటర్ వలన లాభాలు !
  2. దోసె పిండితో మీ ముఖం మెరవడం కాయం !
  3. థైరాయిడ్ సమస్య వస్తే తినాల్సిన మరియు తినకూడని ఆహారం ఏంటి ?
  4. భారత్‌లో ఒమిక్రాన్‌ టెర్రర్‌.. ఒక్కరోజే 8 కేసులు నమోదు.. ఏడు ఒకే రాష్ట్రంలో..
  5. జుట్టు రాలకుండా మనం తీసుకోవలసిన జాగ్రతలు,పరిష్కారాలు

Related Articles

Latest Articles