నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీకు షెడ్యూల్

0
44
Nizamabad,MLC ByElection,Schedule,Ts News,Ts politics,నిజామాబాద్‌,టీఎస్ న్యూస్,టీఎస్‌ పాలిటిక్స్‌, politics, latestnews, Nizamabad, MLC, ByElection,

నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 12న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది.

నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి భూపతి రెడ్డి శాసనమండలికి ఎన్నికయ్యారు. అయితే.. టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతి రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్సీ భూపతి రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ నాటి మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ ప్రకటించారు.

ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్
మార్చి 12న నోటిషికేషన్‌
మార్చి 19వ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు
మార్చి 20న నామినేషన్లను పరిశీలిలన
ఏప్రిల్‌ 7న పోలింగ్
ఏప్రిల్‌ 9న కౌంటింగ్‌
ఏప్రిల్‌ 13తో ఎన్నికక ప్రక్రియకు ముగింపు