చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటుపై నాగబాబు క్లారిటీ

0
57
Nagababu Declares Chiranjeevi MP Ticket, chiranjeevi,nagababu,chiranjeevi ysrcp,chiranjeevi mp seet ycp,chiranjeevi ys jagan,chiranjeevi nagababu,chiranjeevi pawan kalyan,telugu cinema,chiranjeevi acharya movie koratala siva,చిరంజీవి, కొరటాల శివ, ఆచార్య, vakeel shab, PSPK, #PSPK26,

ప్పటికే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. 17 రాష్ర్టాలకు చెందిన 55 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్‌ నెలలో ముగియనుండటంతో… కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.. మార్చి 6వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 16వ తేదీ రోజు నామినేషన్లను పరిశీలన, మార్చి 18వ వరకు నామినేషన్ల ఉపసంహరణ, మార్చి 26వ తేదీన పోలింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక, ఇదే సమయంలో ఏపీకి చెందిన సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మీ, కె. కేశవరావు, మహ్మద్ అలీ ఖాన్ పదవి కాలం ముగిసిపోనుంది.. దీంతో.. ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు వైసీపీకే దక్కనున్నాయి. దీంతో… రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి… అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. చిరును రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారనే గుసగుసలు వినిపించాయి.

ప్రముఖ నటుడు చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దానికితోడు ఈ మధ్య జగన్‌తో చిరంజీవి సన్నిహితంగా ఉండటం.. మొన్నామధ్య కుటుంబ సమేతంగా వెళ్లి ఆయన్ని కలిసి రావడంతో ఈ ప్రచారంలో నిజం ఉందని కొందరు నమ్మేసారు కూడా. మళ్లీ చిరంజీవి రాజకీయాల వైపు వస్తున్నాడని.. వైసీపీలో చేరతాడని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చిరంజీవి తమ్ముడు నాగబాబు స్పష్టం చేసాడు. మెగా అభిమానుల్లో నెలకొన్న గందరగోళం క్లియర్ చేయడానికే తాను వచ్చానని చెప్పాడు ఈయన. అలా కావాలనే కొందరు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని ఆయన ఆరోపించాడు. ప్రస్తుతం చిరంజీవికి జనసేన సహా ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని చెప్పాడు నాగబాబు.

అమరావతికి సంపూర్ణ మద్దతు

కాగా అన్నయ్య రాజధానిపై తన అభిప్రాయాన్నిచెప్తే విజయవాడకు చెందిన కొందరు నిర్మాతలు ఏదేదో మాట్లాడేశారు. అలా అభిప్రాయాలుచెప్పడం తప్పా? అని నాగబాబు ప్రశ్నించారు. ఆయన ఇంటిముందు ధర్నాలు చేయాలనే ఆలోచన మానుకోండి. నేను నా తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ అమరావతికి మావంతు సపోర్ట్‌ చేస్తున్నాం. మా తమ్ముడు పవన్‌కల్యాణ్‌ జనసేన తరపున పోరాటం చేస్తున్నారు. దయచేసి సినిమాలు చేస్తున్న అన్నయ్యను రాజకీయాల్లోకి లాగొద్దు. ఆయనతో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దయచేసి వ్యక్తిగత స్వార్ధం కోసం తప్పుడు వార్తలను ప్రచారం చేసి మెగా అభిమానులు, జన సైనికల్లో అయోమయాన్ని సృష్టించ వద్దని నాగబాబు విజ్ఞప్తిచేశారు.