ఏపీలో స్థానిక సంస్థలు, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు.. తేదీలు ఇవేనా..

0
47
AP elections,ap local body elections,ap muncipal elections,ap panchayat elections,ap election commission,ap news,ap cm ys jaganmohan reddy,telugu news,ఏపీలో ఎన్నికలు,ఏపీ మున్సిపల్ ఎన్నికలు, ఏపీ పంచాయతీ ఎన్నికలు,ఏపీ ఎంపీటీపీ జెడ్పీటీసీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు నగారా మోగింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి . జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు:
మార్చి 7న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి.. మార్చి 21న ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది.

మార్చి 10న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసి.. మార్చి 24వ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది.
మార్చి 15న గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి..మార్చి 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిది. ఈ మేరక ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించింది.

ఏపీలో స్థానిక సంస్థలు, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు.. తేదీలు ఇవేనా..జెడ్పిటిసి, ఎంపిటిసి, పంచాయితీ ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం రిజర్వేషన్లను కన్ఫర్మ్ చేసే పనిలో ఉన్నది. దీని తరువాత నోటిఫికేషన్ ఉంటుంది. నెలరోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని అన్నారు. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెట్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలకోసం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చామని వివరించారు.

డబ్బులు, లిక్కర్‌లను పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతో ఆర్డినెన్స్‌ తెచ్చామని అన్నారు. డబ్బులు పంచుతూ, ఎన్నికల తర్వాత కూడా నిర్ధారణ అయితే అనర్హత వేటు విధిస్తామని… వారికి మూడేళ్ల పాటు జైలు శిక్ష పడుతుందని సీఎం జగన్ వెల్లడించారు.

అయితే, గ్రామ పంచాయితీ కార్యాలయాలకు వైకాపా పార్టీ మూడు రంగులు వేయడాన్ని హైకోర్ట్ తప్పుపట్టింది. మూడు రంగులను వెంటనే తొలగించాలని ఆదేశించింది. పంచాయితీ కార్యాలయాలు ప్రభుత్వానికి సంబంధించినవి అని, వాటికి పార్టీ రంగులు వేయడం మంచి పద్దతి కాదని చెప్పింది. ఇక ఈ ఎన్నికలు కూడా పార్టీలకు సంబంధించిన గుర్తుల మీదనే జరగబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందో చూడాలి.