‘గోదావరి’ పిల్లకు కరోనా దెబ్బ.. ఆకలి బాధకు విలవిల

0
8
నీతూ చంద్ర, కరోనా ఎఫెక్ట్, neetu chandra godavari, neetu chandra corona effect, Neetu Chandra, Godavari movie, corona effect

‘గోదావరి’ చిత్రంతో తెలుగు ఇంటి అమ్మాయిగా ప్రేక్షుకుల్ని అలరించిన హీరోయిన్ నీతూ చంద్ర చేతిలో డబ్బులు ఉన్నా అది తమ ఆకలి తీర్చలేకపోయిందంటుంది. అమెరికాలో తింటికోసం పడిని ఇబ్బందుల్ని షేర్ చేసుకున్నారు.

తెలుగు, తమిళ్, హిందీ, బోజ్‌పురి, గ్రీకు భాషల్లో పాతికకు పైగా సినిమాలు చేసిన నీతూ చంద్ర‌.. ఒక్క బాలీవుడ్‌లోనే 11‌కి పైగా సినిమాలు చేసింది. తెలుగులో మంచు విష్ణు అరంగేట్రం మూవీ ‘విష్ణు’ లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నీతూ చంద్ర.. గోదావరి, సత్యమేవజయతే, మనం సినిమాలతో పాపులర్ అయ్యింది. అయితే ఆమె కెరియర్‌లో గోదావరి చిత్రం మైల్ స్టోన్‌గా నిలిచింది. ఈ చిత్రమే ఆమెకు ఐడెండిటీ తీసుకువచ్చింది.

దాదాపు ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తెలుగులో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. సత్యమేవజయతే చిత్రం తరువాత బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టి ఇటీవలే కొన్ని ప్రాజెక్ట్‌లను దక్కించుకుంది. సుమారు మూడేళ్ల తరువాత రాకరాకవచ్చిన అవకాశంతో.. షూటింగ్ కోసం అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లగా.. అక్కడ కరోనా ప్రభావంతో షూటింగ్ నిలిపివేశారట. దీంతో అక్కడే లాక్ అయిపోవడంతో వసతి, తిండికి నానా ఇబ్బందులు పడిందట నీతూ. ఎలాగోలా అతికష్టం మీది ఇండియాకి చేరుకుంటే ఇక్కడ మమ్మల్ని రోగులుగా చూస్తున్నారని తన బాధల్ని చెప్పుకొచ్చింది నీతూ.