మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

0
31
కరోనా వైరస్ కేసులు, కరోనా వైరస్, coronavirus news in telangana, coronavirus for 3 years boy, coronavirus cases in telangana

హైదరాబాద్‌కు చెందిన 43 ఏళ్ల ఓ మహిళకు కరోనా వైరస్ సోకింది. P34 బాధితుడితో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా ఈమెకు వైరస్ వ్యాపించింది. ప్రస్తుతం ఈమెకు చికిత్స కొనసాగుతోందని.. పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ కేసుతో రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది.

ఇక మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగించే అంశం. ఈ బాలుడు ఇటీవలే తన తల్లిదండ్రులతో పాటు సౌదీ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చాడు. చిన్నారి పరిస్థితి కూడా నిలకడగానే ఉందని వైద్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. ఈ రెండు కొత్త కేసులను P40, P41గా పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 41 కేసులు నమోదవగా.. ఇప్పటికే ఓ వ్యక్తి పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కరోనా అనుమానిత లక్షణాలతో 50 మంది ఆస్పత్రిలో చేరినట్లు వైద్య బులెటిన్‌లో వెల్లడించారు.