2వేల రూపాయల నోట్లు రద్దవుతాయా..?

0
46
2 thousand note band, 2 thousand note ban, 2 thousand note band telugu, 2 thousand note ban in india, 2 thousand note ban about nirmala sitharaman

దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా 2వేల రూపాయల నోట్లు పెద్దగా ఏటీఎంలలో కనిపించడం లేదు. అసలు త్వరలో ఈ 2వేల రూపాయల నోట్లు కనుమరుగు కానున్నట్లు ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. నల్లధనం అరికట్టే పేరుతో 2016లో మోడీ సర్కార్ పాత 500,1000రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం భారతీయులందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో 1000రూపాయల స్థానంలో 2వేల రూపాయల నోటును తీసుకొచ్చింది ఆర్బీఐ.

అయితే ప్రస్తుతం 2వేల రూపాయల నోట్లు పెద్దగా చలామణిలో కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటని ఆరా తీయగా…2వేల రూపాయల నోట్ల చలామణిపై ఓ పబ్లిక్ సెక్టార్ ఆంక్షలు విధించినట్లు తెలిసింది. అంతేకాకుండా 2వేల రూపాయల నోట్లను ఏటీఎంలలో కూడా పెట్టదని ఆంక్షలు విధించిందట. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఏటీఎంలలో 200,500,100రూపాయల నోట్లను మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆ బ్యాంకు సీనియర్ మేనేజ్ మెంట్,అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే చలామణిలో 2వేల రూపాయల నోట్లపై మాత్రమే ఆంక్షలు విధించామని,ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడానికి కస్టమర్లు తీసుకొచ్చే 2వేల రూపాయల నోట్లను తీసుకుంటామని ఆ బ్యాంకు తెలిపింది.

2 వేల రూపాయల నోటు రద్దు చేస్తున్నారన్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. 2 వేల రూపాయల నోట్ల జారీని నిలిపి వేయాల్సిందిగా బ్యాంకులకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. తనకు తెలిసినంతవరకు బ్యాంకులకు అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదంటూ 2 వేల నోట్లకు సంబంధించి జరుగుతున్న పుకార్లను కొట్టి పారేశారు. 2 వేల రూపాయల విలువైన నోట్లు చట్ట బద్ధంగా చలామణిలో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని నిర్మలా సీతారామన్ సూచించారు. దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోట్లను కేంద్రం గతంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో 2 వేల రూపాయల నోట్లను కూడా ఉపసంహరిస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చాలా బ్యాంకులు ఏటీఎంలలో 2 వేలు రూపాయల నోట్లను ఉంచకపోవడం కూడా ప్రచారానికి బలం చేకూర్చింది. 2 వేల రూపాయల నోట్లకు బదులు 500 రూపాయల నోట్లనే ఎటీఎంలలో ఉంచుతుండటంతో ఇలాంటి వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది.