హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఏరో స్పేస్‌ వర్సిటీ

0
49

‘మేటి విద్యా సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఏరో స్పేస్‌ విశ్వ విద్యాలయ స్థాపనకు ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో మీ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాం’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రఖ్యాత బోయింగ్‌ సంస్థ ప్రతినిధులతో అన్నారు. సోమవారం బోయింగ్‌ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు మిచెల్‌ ఆర్థర్‌, సంస్థ ఇండియా అధ్యక్షుడు సలీల్‌ గుప్తా, బోయింగ్‌ ఇండియా డిఫెన్స్‌ ఎండీ సురేంద్ర ఆహూజా తదితరులు కేటీఆర్‌తో భేటీ అయ్యారు.
టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ విభాగాలకు కేంద్ర స్థానంగా హైదరాబాద్‌ను పరిగణించాలని బోయింగ్‌ ప్రతినిధులను మంత్రి కోరారు. తెలంగాణలో ఏరో స్పేస్‌ రంగం అభివృద్ధికి టీఎ్‌సఐపాస్‌ దోహదపడిన తీరును అడిగి తెలుసుకున్నారు. అపాచీ, చినూక్‌ హెలికాప్టర్‌ కార్యకలాపాలు సహా హైదరాబాద్‌లో బోయింగ్‌ సంస్థ సాధించిన ప్రగతిని, విస్తరణపై చర్చించారు. అశ్విని భార్గవ సప్లయర్‌ ఎండీ, బోయింగ్‌ స్టాఫ్‌ చీఫ్‌ ప్రవీణ యగ్రంబట్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయే్‌షరంజన్‌, ఏరో స్పేస్‌ డిఫెన్స్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సమావేశంలో పాల్గొన్నారు.