విద్యార్థులకు గుడ్ న్యూస్… మిలిటరీ కాలేజీలో అడ్మిషన్లు

0
65

ఉత్తరాఖండ్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్-RIMC లో అడ్మిషన్ల కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-APPSC వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. 8వ తరగతిలో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్‌. 2020 జూన్ 1, 2 తేదీల్లో ఎంట్రెన్స్ టెస్ట్ జరుగుతుంది. అబ్బాయిలు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 7వ తరగతి చదువుతున్న, పాసైన విద్యార్థులు మాత్రమే ఆర్ఐఎంసీలో 8వ తరగతిలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫామ్‌ను రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ నుంచి నేరుగా పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం దరఖాస్తు ఫీజు డీడీ తీసి పంపాలి. ఆర్ఐఎంసీలో అడ్మిషన్లకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఫీజు సబ్సిడీ ఇస్తుంది. ప్రస్తుతం ఏడాదికి రూ.42,000 చెల్లిస్తే చాలు. భవిష్యత్తులో ఫీజు పెరిగే అవకాశముంది. అడ్మిషన్ సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ రూ.20,000 చెల్లించాలి. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత రూ.20,000 రీఫండ్ ఇస్తారు.