రాక్ష‌సుడి త‌ర‌హా పాత్ర‌లో నాని…

0
52

క్లాస్, మాస్ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్న నాని తొలిసారి విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. రాక్ష‌సుడి త‌ర‌హా పాత్ర‌లో నాని క‌న‌ప‌డ‌తార‌ని హీరో సుధీర్‌బాబు ఇది వ‌ర‌కే ట్వీట్ కూడా చేశారు. సోమ‌వారం రాక్ష‌సుడి బారి నుండి కాపాడే సేవియ‌ర్ పాత్రధారి ప‌వ‌ర్‌ఫుల్ ఐపీయ‌స్ ఆఫీస‌ర్‌గా సుధీర్‌బాబు న‌టిస్తున్నారు. నాని, సుధీర్‌బాబు పాత్ర‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు పోటాపోటీగా ఉంటాయని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

‘అష్టాచ‌మ్మా’, ‘జెంటిల్‌మ‌న్’ వంటి వైవిధ్య‌మైన చిత్రాల్లో నేచుర‌ల్‌స్టార్ నానిని స‌రికొత్త‌గా ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ వి. ఈసారి కూడా డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మ‌రో కొత్త పాత్ర‌లో నానిని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ఆ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం వి సినిమా చూడాల్సిందే. సాంపుల్‌గా నాని లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాని పోషించ‌ని స‌రికొత్త పాత్ర‌, లుక్‌లో క‌న‌ప‌డుతున్నారు. గ‌డ్డం, మెలితిప్పిన మీసాలు, చేతిలో క‌త్తెర‌, చేతికి ర‌క్తం, చూపుల్లో నిర్ల‌క్ష్యం ఇవ‌న్నీ చూస్తుంటే నాని పాత్ర‌లోని డెప్త్ అర్థం చేసుకోవ‌చ్చు.