పరగడుపున నీళ్లు తాగితే…

0
64

మన ఆరోగ్యం విషయంలో మంచినీరు పోషించే పాత్ర ఎంతో గొప్పది. వాహనం నడవాలంటే ఇంధనం ఎంత అవసరమో మనిషి శరీరం పనిచేయటం కోసం మంచి నీరూ అంతే అవసరం. అందునా పరగడుపున నీళ్లు తాగటం మరింత మేలు చేస్తుంది. ఈ అలవాటు మూలంగా కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకొందాం.

  • ఉదయం లేచిన వెంటనే మంచినీళ్లు తాగితే వల్ల మల విసర్జన సులభంగా జరుగుతుంది.
  • పరగడుపున నీళ్లు తాగటం వల్ల ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలు ఏరోజుకారోజు బయటికి వెళ్లిపోతాయి.
  • పెద్ద పేగు శుభ్ర పడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది.
    రక్త వద్ధి, శుద్ధి జరిగేందుకు ఉదయం తాగే నీరు ఉపయోగపడుతుంది.
  • కండరాలు బలపడి, చక్కగా పెరిగేందుకు తగినంత నీరు తాగటం అవసరం. ఉదయాన్నే అరలీటరు నీరు తాగేవారిలో జీవక్రియల పనితీరు సగటున 24 శాతం మేర పెరుగుతుంది.
  • బరువు తగ్గే ప్రయత్నం చేసేవారు పొద్దున్నే నీళ్లు తాగటం ఎంతైనా అవసరం.
  • ఉదయాన్నే తగినంత నీరు తాగేవారి చర్మం సహజంగా, తగినంత తేమతో, మదువుగా మారుతుంది.
  • ఉదయాన్నే నీరు తాగేవారిలో మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్స్‌ ముప్పు తక్కువ. వచ్చినా వెంటనే తగ్గుతాయి.
  • పరగడుపున నీళ్లు తాగటం వల్ల ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి.