చెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు.. ఇరుక్కుపోయిన విద్యార్థి…

0
45

నిజామాబాద్ జిల్లాలోని నల్లవెల్లి దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. డిచ్‌పల్లి విద్యా పబ్లిక్ స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ విద్యార్థి కాలు బస్సు ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు గ్యాస్ కట్టర్‌ సాయంతో విద్యార్థిని బయటకు తీశారు. గాయపడిన విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.