కేంద్రం ప్రకటించిన 1.7లక్షల కోట్ల ప్యాకేజీతో లబ్ధి పొందేది వీళ్లే

0
3

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆర్థిక ప్యాకేజీ వివరాలను ప్రకటించారు.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో 1.7లక్షల కోట్ల ప్యాకేజీని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ప్రకటించింది. ఈ పథకం ద్వారా కొందరికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయాలని నిర్ణయించారు. ఈ పథకం కింద వృద్ధులు,రైతులు,పెన్షనర్లు,వితంతువులు,జన్ థన్ ఖాతాదారులు,స్వయం సహాయక బృందాలు,కూలీలు,కార్మికులు,ఉద్యోగులు ఇలా దాదాపు అన్ని వర్గాల వాళ్లు లబ్ధిపొందనున్నారు.

-మూడు నెలల పాటు వారికి వైద్య బీమా కవరేజీగా ఆరోగ్య సంరక్షణ కార్మికులకు రూ .50 లక్షల బీమా ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

-ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతలుగా రూ.6000 అకౌంట్లో జమ చేస్తుందన్న విషయం తెలుసుకదా. ఆ పథకానికి సంబంధించి తొలి విడుత డబ్బులు రూ.2000ను ఏప్రిల్ మొదటి వారంలో ప్రభుత్వం జమ చేస్తుంది. దీని వల్ల 8.70 కోట్ల మందికి లబ్ధి జరుగుతుందని కేంద్రం ప్రకటించింది.

-జాతీయ ఉపాధిహామీ పథకం కింద ఇచ్చే డబ్బులను రూ .182 నుంచి రూ .202 కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఒక్కో కార్మికునికి రూ .2000 పెరగనుంది. 5కోట్ల మందికి దీని వల్ల ప్రయోజనం చేకూరుతుంది.వృద్ధులు, వితంతువులు, పెన్షనర్లకు మూడు నెలల్లో ఎక్స్‌గ్రేషియా కింద రూ.1000 ఇస్తారు. ఒక్కో విడుత రూ.500 చొప్పున రెండు సార్లు ఇస్తారు

-వృద్ధులు/ వితంతువులు: వృద్దులు,దివ్యాంగులకు ప్రతీ నెలా ఎక్స్‌గ్రేషియా కింద రూ.1000 చెల్లించనున్నారు. దీనివల్ల 3 కోట్ల మంది లబ్ధి చేకూరుతుంది.జన్‌ధన్ అకౌంట్లు ఉన్న మహిళలకు… ప్రతీ నెలా వారి అకౌంట్ లో రూ.500 చొప్పున రాబోయే మూడు నెలల పాటు జమ చేయనున్నారు. దీనివల్ల 20 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం ఉంటుంది.

-ఉజ్వల పథకం కింద గ్యాస్ పొందిన 8.3 కోట్ల కుటుంబాలకు మూడు నెలలు పాటు మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు.

దీన్ దయాల్ జాతీయ జీవనోపాధి మిషన్ కింద స్వయం సహాయక ఇచ్చే రుణ పరిమితి రూ.10లక్షల నుంచి రూ.20లక్షలకు పెంపు. ఎలాంటి పూచీకత్తు లేని రుణాలు అందజేయడం. దీని ద్వారా 63 లక్షల స్వయం సహాయక బృందాలకు లబ్ధి చేకూరనుంది.

రాబోయే మూడు నెలలకు భారత ప్రభుత్వం యజమాని మరియు ఉద్యోగి ఇద్దరికీ కలిపి ఈపీఎఫ్ సహకారాన్ని చెల్లిస్తుంది. ఇది 100 మంది ఉద్యోగులతో ఉన్న సంస్థలకు, రూ.15వేల లోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్‌ చందా కేంద్రమే భరిస్తుంది. ఉద్యోగి వాటా 12శాతం, యజమాని వాటా 9శాతం కలిపి ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది.

– లాక్డౌన్ కారణంగా ఆర్థిక విఘాతం ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు సహాయం చేయడానికి సుమారు రూ .31,000 కోట్లు ఉన్న భవనం మరియు నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వబడ్డాయి.

-ఇప్పటికే ప్రకటించి ఉన్న ఐదు కిలోల గోధుమ / బియ్యం తో పాటుగా… ప్రతి నెలా మూడు కిలోల బియ్యం లేదా గోధుమలు మరియు ఒక కిలో పప్పు ధాన్యాలను మూడు నెలల కాలానికి ఉచితంగా పేద గృహాలకు సరఫరా చేయనున్నారు.