కసబ్ చేతికి ఎర్రదారం కథేంటి..?

0
29
ajmal kasab, ajmal kasab interview, ajmal kasab parents, ajmal kasab lawyer, ajmal kasab video, ajmal kasab last words, ajmal kasab death video, ajmal kasab movie, ajmal kasab in hindi, ajmal kasab advocate,

26/11 ముంబై ఉగ్రదాడుల ఘటనను యావత్ భారత దేశం మర్చిపోదు. అయితే, ఈ కేసు కు సంబంధించి ముంబై మాజీ పోలీసు కమిషన్ రాకేశ్ మరియా సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన రాసిన పుస్తకం ‘లెట్ మీ సే ఇట్ నౌ’ లో ఈ దాడికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

   2008 నాటి ముంబై దాడులను హిందూ ఉగ్రదాడిగా చిత్రీకరించేందుకు లష్కరే తొయిబా కుట్ర పన్నిందని రాకేశ్ ఆరోపించారు. వాస్తవానికి, కసబ్ పాకిస్తానీ ఉగ్రవాది. కానీ, అతనొక హిందువు గా, బెంగళూరుకు చెందిన సమీర్ చౌదరిగా నమ్మించేలా లష్కరే తొయిబా కుట్ర చేసారని మరియా ఆరోపించారు. ముంబై దాడి కి కారకులైన ఉగ్రవాదులను హిందువులు గా చూపేందుకు తోయిబా నకిలీ ఐడి కార్డులను కూడా సృష్టించింది. ఒకవేళ అంతా తాను రాసుకున్న ప్లాను ప్రకారం జరిగి ఉంటె, ఈ దాడి ని హిందువుల దాడి గా మీడియా చూపించాలని ఆమె అంచనా వేసింది.

     కసబ్ చేతికి ఎర్ర దారం ఉన్న ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. దీని వెనుక కసబ్ ను ఓ హిందువు గా నమ్మించే కుట్ర దాగి ఉంది. దాని ద్వారా 26/11 ముంబై దాడిని హిందువుల దాడి గా ప్రచారం చేయాలనీ తోయిబా ప్రయత్నించినట్లు తెలుస్తుంది. టాప్ టివి జర్నలిస్టులు ఇది హిందువుల ఉగ్రదాడి గా నమ్మి ప్రచారం చేస్తారని భావించింది. కానీ విచారణ లో కసబ్ ఫరీద్ కోట కు చెందినవాడిగా తేల్చామన్నారు.

    ఈ దాడుల్లో వీరమరణం పొందిన కానిస్టేబుల్ తుకారం ఓంబ్లే కసబ్‌ను ప్రాణాలతో పట్టుకోవడంతో లష్కరే కుట్ర భగ్నమైందన్నారు. కసబ్ దొంగతనాలు చేయడం కోసం లష్కరే తొయిబాలో చేరాడని.. జిహాద్‌కు అతడితో సంబంధం లేదన్నారు. భారత్‌లో ముస్లింలను నమాజ్ చేసుకొనివ్వరని కసబ్‌‌ను నమ్మించారన్నారు. అందుకే మెట్రో సినిమా సమీపంలోని మసీదుకు వెళ్లినప్పుడు కసబ్ షాకయ్యాడన్నారు.

   మొత్తం పది మంది ఉగ్రవాదులతో ఈ మారణహోమం సృష్టించారు. ఈ దుర్ఘటన లో 166 మంది మృతి చెందగా, 300 పైగా జనాలు గాయపడ్డారు. కాగా, ఈ ఘటనలో ప్రాణాలతో పట్టుబడ్డ ఒకే ఒక్క ఉగ్రవాది కసబ్. అతనిని 2012 నవంబర్ 21న ఉరి తీశారు.