ఇంటర్‌ వొకేషనల్‌ విద్యార్థులకు అప్రెంటి్‌సషిప్‌

0
63

హైదరాబాద్:ఇంటర్‌ వొకేషనల్‌ విద్యార్థులకు కమిషనర్‌ ఉమర్‌ జలీల్‌ శుభవార్త అందించారు. ఈ విద్యార్థులకు ఉపాధి అందించేందుకు వీలుగా దాదాపు నాలుగేళ్ల తర్వాత అప్రెంటి్‌సషి్‌పను ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం పలు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏయే కోర్సులకు డిమాండ్‌ ఉంది? ఏయే విభాగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? అనే అంశాలపై, అప్రెంటిషిప్‌ అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ముఖ్యంగా వొకేషనల్‌ పారామెడికల్‌ కోర్సులకు భారీగా డిమాండ్‌ ఉన్నట్లు ఆస్పత్రుల యాజమాన్యాలు తెలిపాయి. ఇప్పటికిప్పుడు వందల సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని కమిషనర్‌ దృష్టికి వారు తీసుకొచ్చారు. దీంతో ఏటా ఏప్రిల్‌, మే నెలల్లో అప్రెంటి్‌సషిప్‌ మేళా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ప్రత్యేక కమిటీ వేయాలని అధికారులు నిర్ణయించారు.